రామ్‌చరణ్‌తో అశ్వనీదత్ ఓ సినిమా నిర్మించనున్నారు. 'జగదేకవీరుడు' అనే టైటిల్‌ని రిజిస్టర్ కూడా చేసేశారు. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాకి సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో రామ్‌చరణ్‌తో సినిమా చేస్తానని అశ్వనీదత్ ఎప్పటినుంచో చెబుతున్నారుగానీ, సినిమా పట్టాలెక్కడంలేదు. దర్శకుడు ఎవరు.? అన్నది ఇప్పటికీ సస్పెన్సే.
ఇక, పవన్‌కళ్యాణ్ హీరోగా దాసరి నారాయణరావు నిర్మించే చిత్రానికి 'బోస్' అనే టైటిల్ అనుకుంటున్నారు. దీనికోసం టైటిల్‌ని ఇప్పటికే ఛాంబర్‌లో రిజిస్టర్ చేశారు. ఇటీవల పవన్‌కళ్యాణ్‌కి పుట్టిరోజు శుభాకాంక్షలు చెబుతూ, తారక ప్రభు ఫిలింస్ పతాకంపై పవన్‌తో సినిమా నిర్మిస్తున్న విషయాన్ని ప్రకటించారు దాసరి. కానీ, ఇక్కడా దర్శకుడు లేడు. ముందు త్రివిక్రమ్‌తో అనుకున్నా, త్రివిక్రమ్ వేరే బ్యానర్‌లో పవన్‌తో సినిమా చేయనున్న దరిమిలా, దాసరికి దర్శకుడు దొరకని పరిస్థితి.
కళ్యాణ్‌రామ్ కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై 'బాక్సర్' అనే టైటిల్‌ని రిజిస్టర్ చేయించాడు. దీనికీ దర్శకుడెవరో తెలియడంలేదాయె. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ బాక్సర్ తెరకెక్కే అవకాశముందన్న ప్రచారమైతే జరుగుతోంది. ఛాంబర్‌లో టైటిల్స్ రిజిస్టర్ చేయడం, వాటిల్లో చాలావరకు మురిగిపోవడం మామూలే. కానీ, పెద్ద హీరోల కోసం పెద్ద నిర్మాతలు రిజిస్టర్ చేసే టైటిల్స్ విషయంలో కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుండడం ఆశ్చర్యకరమే.
హీరోలున్నారు, నిర్మాతలున్నారు.. దర్శకులే కరువైపోయారు. ఇదీ టాలీవుడ్‌లో ప్రస్తుత పరిస్థితి. బిజినెస్ సమీకరణలు మారిపోయాక, స్టార్ డైరెక్టర్స్ మరీ లిమిటెడ్ అయిపోవడంతో, హీరోలు సైతం దర్శకుల్లేక కిందా మీదా పడాల్సి వస్తోంది.