అవసరాల మీరు కూడా?

తెలుగు దర్శకులు కాస్త డిఫరెంట్ లైన్ ఆలోచించారు అనేసరికి ముందు ఇండస్ట్రీ జనాలకే అనుమానం వచ్చేస్తుంది. అందరూ కొరియా, జపాన్, ఇలా దేశ బేధాలు, భాషా బేధాలు లేకుండా సినిమాలు చూసి, జస్ట్ లైన్…

తెలుగు దర్శకులు కాస్త డిఫరెంట్ లైన్ ఆలోచించారు అనేసరికి ముందు ఇండస్ట్రీ జనాలకే అనుమానం వచ్చేస్తుంది. అందరూ కొరియా, జపాన్, ఇలా దేశ బేధాలు, భాషా బేధాలు లేకుండా సినిమాలు చూసి, జస్ట్ లైన్ దొరికితే చాలు ఎత్తుకొచ్చి, దాన్ని తెలుగైజ్ చేసేవారే. అందుకే అవసరాల శ్రీనివాస్ 'జ్యో అచ్యుతానంద' సినిమా హిట్ అయ్యేసరికి మూలాలు వెదికే పని ప్రారంభమయింది. ఈ పనిలో కొందరు కొంచెం సక్సెస్ అయ్యారు కూడా. 

అలా వెదుకులాటలో తెలిసిన సంగతి ఏమిటంటే, ఈ సినిమాకు మూలం దుబాయ్ అనే దుబాయి సినిమా అని. 2005 సెప్టెంబర్ లో విడుదలయిందీ సినిమా. బతుకు తెరువు కోసం దుబాయ్ చేరిన ముగ్గురి మధ్య నడిచిన కథ. ఇద్దరు అన్నదమ్ములు..ఓ అమ్మాయి. ఇద్దరు అన్నదమ్ములకు ఒకరంటే మరోకరికి బోలెడంత అభిమానం. కానీ అమ్మాయి రాకతో ఇద్దరి మధ్య గ్యాప్. మళ్లీ అమ్మాయి వెళ్లిపోవడంతో ఒకటి కావడం. ఈ లైన్ ను జస్ట్ తీసుకుని, అవసరాల తన సినిమా కథను తయారుచేసుకున్నట్లుంది.

అలా అని అవసరాల స్టామినాను తక్కువ అంచనా వేయక్కరలేదు. రైటర్ గా ఆయనకు వుండే ప్లస్ పాయింట్లు ఆయనకు వున్నాయి. కానీ కథ మాత్రం అరువు తెచ్చుకోక తప్పలేదేమో? అదే నిజమైతే, అవసరాల లాంటి వాళ్లు, ఇన్ స్పియర్డ్ బై అనో, ఇంకోటనో క్రెడిట్ లైన్ ఇస్తే, వాళ్లపై మనకు మరింత గౌరవం కలుగుతుంది. లేదు అంటే, ఓహో..ఈయనా అదే బాపతా? అనేసుకోవాల్సి వస్తుంది. ఆ సినిమా ట్రయిలర్ పై మీరూ ఓ లుక్కేయండి

Watch Dubai Trailer