నితిన్ రైటా? రాంగా?

అ..ఆ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తరువాత కూడా హీరో నితిన్ సినిమా వెంటనే తెరకెక్క లేదు. సరైన డైరక్టర్ దొరక్కపోవడమే కారణం. ఆఖరికి హను రాఘవపూడితో సినిమా ఫిక్స్ అయింది. అయితే ఇది…

అ..ఆ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తరువాత కూడా హీరో నితిన్ సినిమా వెంటనే తెరకెక్క లేదు. సరైన డైరక్టర్ దొరక్కపోవడమే కారణం. ఆఖరికి హను రాఘవపూడితో సినిమా ఫిక్స్ అయింది. అయితే ఇది కరెక్ట్ చాయిస్ కాదన్న కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. నితిన్ ఎన్ని హిట్ లు కొట్టాడు, ఏ రేంజ్ హిట్ లు కొట్టాడు అన్న సంగతి పక్కన పెడితే, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ఏస్ డైరక్టర్ తో సినిమా చేసాడు. అది కూడా నలభై కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 

మరి దాని తరువాత ఏంటీ? అంటే ఆ సినిమా కాస్త మీదకే వుండాలి కాని కిందకు కాదు. హను రాఘవపూడి చేసిన సినిమాలు జస్ట్ హిట్ అనిపించుకోవచ్చు కానీ, సూపర్ హిట్ లు కానీ, కలెక్షన్లు కుమ్మేసినవి కానీ కావు. నితిన్ మళ్లీ మరో నలభై కోట్లు రేంజ్ సినిమా చేయాలంటే హను రాఘవపూడి కాంబినేషన్ సరిపోతుందా అని అనుమానం. అయితే ఇక్కడ నితిన్ సమస్య కూడా వుంది. అ..ఆ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చినా కూడా సరైన ఫెద్ద డైరక్టర్లు ఎవరూ అందుబాటులోకి రాలేదు. 

అంతకు ముందు పూరి లాంటి డైరక్టర్ తో చేసినా ఫలితం లేకపోయింది. బహుశా అందుకే కావచ్చు, నితిన్ మళ్లీ తన ఒరిజినల్ రేంజ్ సినిమాకే ఫిక్స్ అయిపోయినట్లున్నాడు. లేట్ అయితే అయింది.. కథ కథనాల విషయంలో మరి కాస్త జాగ్రత్తలు తీసుకుని, శ్రీనువైట్ల, శ్రీకాంత్ అడ్డాల, వంశై పైడిపల్లి లాంటి డైరక్టర్లను ట్రయ్ చేసి వుంటే బాగుండేదేమో?