డిఫరెంట్ రూట్లో విజయ్

ఒక సినిమా హిట్ కాగానే ఆఫర్లు వెల్లువెత్తుతాయి. అలాంటి సమయంలో ఎవరైనా సరే తడబడతారు. తప్పడడుగులు వేస్తారు. రెమ్యూనిరేషన్, అడ్వాన్స్ లకు టెంప్ట్ అవుతారు.  పెళ్లి చూపులు హీరో విజయ్ ఇక్కడే చాలా జాగ్రత్తగా…

ఒక సినిమా హిట్ కాగానే ఆఫర్లు వెల్లువెత్తుతాయి. అలాంటి సమయంలో ఎవరైనా సరే తడబడతారు. తప్పడడుగులు వేస్తారు. రెమ్యూనిరేషన్, అడ్వాన్స్ లకు టెంప్ట్ అవుతారు.  పెళ్లి చూపులు హీరో విజయ్ ఇక్కడే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడట. బ్యానర్, స్టోరీ, డైకర్టర్ ఇవన్నీ పెర్ ఫెక్ట్ గా సింక్ అయితేనే ఓకె అంటున్నాడట. 

అంతే కానీ, అడిగారు కదా, బాగానే ఇస్తామంటున్నారు కదా అని ఓకె అనేయడం లేదట. ఇలా జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే పూరి జగన్నాధ్ సినిమాకు కూడా నో అని చెప్పేయాల్సి వచ్చిందట. పూరి జగన్నాధ్ సినిమా కోసం అడగడం,  విజయ్ అక్కడి వ్యవహారాలన్నీ చూసి నో అనేయడం జరిగిపోయిందని తెలుస్తోంది. 

పైగా విజయ్ తీసుకున్న మరో మంచి నిర్ణయం ఏమిటంటే, పారితోషికం గురించి అప్పడే పెద్దగా పట్టు పట్టకపోవడం. అందుకే రెండు మూడు  మంచి బ్యానర్లలో మంచి ప్రాజెక్టులకు విజయ్ ఇఫ్పుడు పచ్చ జెండా ఊపేసాడు. వినాయకచవితి తరువాత వీటికి సంబంధించిన ప్రకటనలు వస్తాయి. మొత్తానికి ఎంట్రీ లెవెల్ యంగ్ హీరోల జాబితాలో రాజ్ తరుణ్, నాగశౌర్య, నిఖిల్, లాంటి వాళ్ల సరసన విజయ్ కూడా చేరాడు. కాంపిటీషన్ పెరుగుతోంది మరి.