అబ్దుల్ వాహిబ్.. కీప్ ఇట్ అప్

ఒకప్పుడు అంటే చాలా దశాబ్దాల కిందట, చిన్న సినిమా … పెద్ద సినిమా, పెద్ద హీరో, చిన్న హీరో అనే తేడా వుండేది కాదు సంగీత దర్శకులకు. అందువల్ల చంద్రమోహన్, భానుచందర్, సుమన్ లాంటి…

ఒకప్పుడు అంటే చాలా దశాబ్దాల కిందట, చిన్న సినిమా … పెద్ద సినిమా, పెద్ద హీరో, చిన్న హీరో అనే తేడా వుండేది కాదు సంగీత దర్శకులకు. అందువల్ల చంద్రమోహన్, భానుచందర్, సుమన్ లాంటి హీరోలకు అనేక మాంచి మ్యూజిక్ ఆల్బమ్స్ వున్నాయి. కానీ రాను రాను రోజులు మారాయి. చిన్న హీరోల, చిన్న సినిమాలకు పెద్ద మ్యూజిక్ డైరక్టర్ లు పని చేయడమే మానేసారు. పని చేసినా మంచి పాటలు ఇవ్వడం అన్నదే లేదు. బ్యానర్ లేదా బ్యాకింగ్ వుంటేనే కాస్త శ్రద్దగా పని చేస్తున్నారు. లేదంటే లేదు.

ఇలాంటి నేపథ్యంలో ఖుషీ లాంటి పెద్ద సినిమాకు పని చేసి, మాంచి పేరు తెచ్చుకున్న హేషమ్ అబ్దుల్ వాహబ్ స్పార్క్ అనే చిన్న సినిమాకు పని చేస్తున్నారు. చిన్న హీరో అయినా కాస్త గట్టి బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు మంచి అల్బమ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అబ్దుల్ వాహిబ్. ఇప్పటికి ఈ సినిమా కోసం మూడు పాటలు ఇచ్చారు. మూడూ కూడా ఫరావాలేదు, మంచి పాటలు అవుతాయి, జనంలోకి వెళ్తే అనేలాగే చేసాడు తప్ప, ఏవో చేసి ఇచ్చేసా అనేలా మాత్రం కాదు.

లేటెస్ట్ గా వచ్చిన లేఖా.లేఖా అనే పాట కూడా సౌండింగ్,ట్యూన్ కొత్తగా వుంది. సంగీత దర్శకులు ఇలా చిన్న పెద్ద హీరోలు, చిన్న సినిమా పెద్ద సినిమా అన్నది చూడకుండా మ్యూజిక్ ఇస్తే మంచి పాటలు వస్తాయి. అవి ఆ సినిమాలకు ఉపయోగపడాయి.

‘స్పార్క్ లైఫ్’ సినిమాను కాస్త మంచి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. విక్రాంత్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతోన్నారు. విక్రాంత్ ఈ సినిమాతో హీరోగా మాత్రమే కాకుండా కథకుడు, స్క్రీన్ ప్లే రైటర్‌గానూ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లేను విక్రాంత్ అందించారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ మీద రాబోతోన్న ఈ చిత్రంలో మెహరీన్, రుక్షర్ థిల్లాన్‌‌లు హీరోయిన్లుగా నటించారు.