విశాల్‌ – వరలక్ష్మి.. రివెంజ్ లవ్‌ స్టోరీ

తమిళ హీరో విశాల్‌, తమిళ హీరోయిన్‌ వరలక్ష్మి మధ్య ఎప్పటినుంచో ప్రేమాయణం నడుస్తోంది. వరలక్ష్మి ఎవరో కాదు, ప్రముఖ తమిళ నటుడు శరత్‌కుమార్‌ కుమార్తె. శరత్‌కుమార్‌ అంటే విశాల్‌కి పడదు. ఇద్దరి మధ్యా తమిళ…

తమిళ హీరో విశాల్‌, తమిళ హీరోయిన్‌ వరలక్ష్మి మధ్య ఎప్పటినుంచో ప్రేమాయణం నడుస్తోంది. వరలక్ష్మి ఎవరో కాదు, ప్రముఖ తమిళ నటుడు శరత్‌కుమార్‌ కుమార్తె. శరత్‌కుమార్‌ అంటే విశాల్‌కి పడదు. ఇద్దరి మధ్యా తమిళ సినీ రాజకీయాల పరంగా ఎన్నో వివాదాలున్నాయి. 'నువ్వెంత..' అని విశాల్‌ అంటే, 'నువ్వుంత..' అని శరత్‌కుమార్‌ సవాల్‌ విసిరిన, విసురుకున్న సందర్భాలున్నాయి. ఈ వివాదాల కారణంగానే ఆ మధ్య శరత్‌కుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ టైమ్‌లోనే, తన ప్రేమ గురించి విశాల్‌ సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికరమైన ఫొటో పెట్టాడు కూడా. 

'ఈ ఫోటోలోనే వుంది అంతా..' అంటూ వరలక్ష్మితో క్లోజ్‌గా వున్న ఫొటోని సోషల్‌ మీడియాలో పెట్టి, 'అసందర్భం.. అమానవీయం..' అనే విమర్శల్ని విశాల్‌ ఎదుర్కొన్నాడు. తాజాగా, విశాల్‌ తన పుట్టినరోజు వేడుకల్ని వెరైటీగా జరుపుకున్నాడు. వరలక్ష్మితో కలిసి ఆసుపత్రికి వెళ్ళి, అక్కడ కొత్తగా జన్మించిన 20 మంది చిన్నారులకు బంగారు ఉంగరాల్ని బహుమతిగా ఇచ్చాడు విశాల్‌. ఈ సందర్భంగా విశాల్‌ – వరలక్ష్మి చేసిన హంగామా ఓవరాక్షన్‌ని తలపించింది. 

ఇదిలా వుంటే, 'నా ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు..' అంటూ వరలక్ష్మి, సోషల్‌ మీడియాలో విశాల్‌ని ఉద్దేశించి పోస్ట్‌ చేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఎందుకంటే, మొన్నీమధ్యనే 'ప్రేమకి టైమ్‌ లేదు.. కెరీర్‌లో బిజీగా వున్నాను.. అసలు పెళ్ళి మాటే లేదు..' అని ఈ మధ్యనే మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఘాటుగా సమాధానమిచ్చింది. 

ఏంటో, అంతా కన్‌ఫ్యూజన్‌. ఓ పక్క ప్రేమ అంటారు.. ఇంకో పక్క ప్రేమ లేదంటారు.. కానీ ప్రేమ పేరుతో పబ్లిసిటీ స్టంట్స్‌ చేస్తుంటారు.. పైగా, శరత్‌కుమార్‌పై ఇద్దరూ రివెంజ్‌ తీర్చుకున్నట్లుగా సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంటారు. ఏంటో ఈ అతి.! అసలు దీన్ని ఓ లవ్‌ స్టోరీ అనగలమా.? ఇదేదో రివెంజ్‌ స్టోరీలా వున్నట్లుంది కదా.!