అందరు హీరోయిన్లు ఒకలా వుండరు..గోకేద్దాం అనుకుంటే గోకించేసుకునేందుకు రెడీగా వుండరు. ఈ మధ్య ఓ మిడిల్ ఎజ్డ్ దర్శకుడు ఓ ముద్దుగా, కాస్త బొద్దుగా, చాక్ లేట్ బేబీలా వుండే హీరోయిన్ ను ఇలాగే ట్రయ్ చేయబోయాడట.
నేను ఆ రెండు అక్షరాల హీరోయిన్ ను టచ్ చేసా..ఆ రేంజ్ కు వెళ్లింది. ఆ ఫైట్ మాస్టర్ కు నేనే లిఫ్ట్ ఇచ్చా, ఇంకో రెండు అక్షరాల పేరున్న హీరోయిన్ కు కూడా నేనే చాన్సిచ్చా..బడా హీరోయిన్ అయిపోయింది..ఇక నీదే ఆలస్యం అనే టైపులో కథలు వినిపించాడట.
దానికి ఆ ముద్దుబొద్దు అమ్మడు..నీ పిట్ట పర్సనాలిటీ ఏమిటి? నా హెయిట్ వెయిట్ ఏమిటి? మోజు పడ్డానికైనా హద్దు పద్దు వుండొద్దా అని నవ్వుతూ తీసి పారేసి, ఊరుకోకుండా ఓ సినిమా హీరోకి చెప్పిందట. దాంతో సదరు హీరో, ఈ డైరక్టర్ గారిని క్యారవాన్ లోకి పిలిచి కాస్త గట్టిగానే మందలించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బుద్దిగా సినిమా చేసుకోక ఎందుకో ఈ గోకుడులు. పెళ్లయి, పెళ్లాం పిల్లలు వుండి కూడా.