మహేష్‌ని, జూ.ఎన్టీఆర్‌ దాటేస్తాడా.?

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన 'జనతా గ్యారేజ్‌' విడుదలకు సిద్ధమయ్యింది. సెప్టెంబర్‌ 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా పబ్లిసిటీని ఓ రేంజ్‌లో షురూ చేశారు. ఇటు ఎన్టీఆర్‌కీ, అటు కొరటాల శివకీ…

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన 'జనతా గ్యారేజ్‌' విడుదలకు సిద్ధమయ్యింది. సెప్టెంబర్‌ 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా పబ్లిసిటీని ఓ రేంజ్‌లో షురూ చేశారు. ఇటు ఎన్టీఆర్‌కీ, అటు కొరటాల శివకీ ఇది హ్యాట్రిక్‌ ఫిలిం. ఎన్టీఆర్‌ వరుసగా రెండు హిట్స్‌తో మంచి జోరుమీదుంటే, కొరటాల శివదీ సేమ్‌ టు సేమ్‌ సీన్‌. 

సినిమా సినిమాకీ కొరటాల శివ రేంజ్‌ పెంచుకుంటూ పోతోంటే, 'టెంపర్‌' ముందు వరకూ ఓ లెక్క.. 'టెంపర్‌' తర్వాత ఇంకో లెక్క.. ఎన్టీఆర్‌ ఈజ్‌ బ్యాక్‌.. అంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌, టాలీవుడ్‌ బాక్సాఫీస్‌కి సవాల్‌ విసిరే రేంజ్‌కి ఎదిగాడు. వాస్తవానికి, ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్‌ స్టామినాకి తగ్గ సినిమా రాలేదన్నది నిర్వివాదాంశం. ఎన్టీఆర్‌కి సరైన హిట్‌ పడితే, అది టాలీవుడ్‌ రికార్డుల్ని తిరగరాసేలా వుంటుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. 

సో, కొరటాల – ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వస్తోన్న 'జనతా గ్యారేజ్‌' సినిమాపై ఆకాశాన్నంటే అంచనాలు వుండడం సహజమే. ఆ అంచనాల్ని ఏమాత్రం అందుకున్నా, ఈ కాంబినేషన్‌ సృష్టించే సంచలనం అలా ఇలా వుండదు. ట్రేడ్‌ సర్కిల్స్‌లోనూ, ప్రేక్షకల్లోనూ, సినీ పరిశ్రమలోనూ ఇప్పుడు ఈ సినిమా హాటెస్ట్‌ టాపిక్‌. మహేష్‌ 'శ్రీమంతుడు' చిత్రాన్ని దాటి ఎన్టీఆర్‌ ఈ సినిమాతో వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తాడని ఎన్టీఆర్‌ అభిమానులు కోటి ఆశలతో 'జనతా గ్యారేజ్‌' సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. 

చూద్దాం.. 'జనతా గ్యారేజ్‌' సినిమాతో ఎన్టీఆర్‌ అంచనాల్నే అందుకుంటాడో, అంచనాల్ని మించి ఘన విజయాన్ని అందుకుంటాడో.!