రామ్ చరణ్-మెగా ఎక్స్ ప్రెస్

అదిగో సినిమా అంటే ఇదిగో వర్కింగ్ టైటిల్ అంటున్నారు జనాలు. అంత ఫాస్ట్ అయిపోయారు. సినిమా జనాల కన్నా ముందే అభిమానులు తమ టాలెంట్ చూపించి టైటిళ్లు పిక్స్ చేస్తున్నారు, టీజర్లు రెడీ చేస్తున్నారు.…

అదిగో సినిమా అంటే ఇదిగో వర్కింగ్ టైటిల్ అంటున్నారు జనాలు. అంత ఫాస్ట్ అయిపోయారు. సినిమా జనాల కన్నా ముందే అభిమానులు తమ టాలెంట్ చూపించి టైటిళ్లు పిక్స్ చేస్తున్నారు, టీజర్లు రెడీ చేస్తున్నారు. రామ్ చరణ్-మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో యువి క్రియేషన్స్ ఓ సినిమా నిర్మిస్తుందని వార్తలు వినిపించాయి. దానికి ఇంకా టైమ్ వుంది. ఎందుకంటే ధృవ పూర్తి కావాలి. 

అలాగే సుకుమార్-మైత్రీ మూవీస్ సినిమా ఫినిష్ అవ్వాలి. కానీ అభిమానులు మాత్రం అప్పుడే ఓ టైటిల్ ఫిక్స్ చేసేసినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాకు మెగా ఎక్స్ ప్రెస్ అన్న టైటిల్ అందుకే వినిపిస్తోంది. మేర్లపాక మురళి ఇప్పటికి రెండు సినిమాలు చేసారు. ఒకటి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, రెండవది ఎక్స్ ప్రెస్ రాజా. బహుశా ఆ సెంటిమెంట్ నే ఊహించి ఈ మెగా ఎక్స్ ప్రెస్ అన్న టైటిల్ బయటకు వచ్చి వుంటుంది. బాగుందని అనిపిస్తే ఇదే ఫిక్స్ చేసేస్తారేమో?