సిక్స్‌ ప్యాక్‌ రేంజ్‌లో ఆదాశర్మ ఫీట్లు.!

'హీరోలకేనా సిక్స్‌ ప్యాక్‌.. మేం కూడా చేయగలం..' అంటూ కొందరు మహిళలు ఫిట్‌నెస్‌లో సత్తా చాటుతుంటారు. అయితే హాలీవుడ్‌లోనే తప్ప మన ఇండియాలో మహిళలు సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌ని ట్రై చేసిన సందర్భాలు చాలా…

'హీరోలకేనా సిక్స్‌ ప్యాక్‌.. మేం కూడా చేయగలం..' అంటూ కొందరు మహిళలు ఫిట్‌నెస్‌లో సత్తా చాటుతుంటారు. అయితే హాలీవుడ్‌లోనే తప్ప మన ఇండియాలో మహిళలు సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌ని ట్రై చేసిన సందర్భాలు చాలా చాలా అరుదు. అయితే, జీరో సైజ్‌ పేరుతో దాదాపు సిక్స్‌ ప్యాక్‌ హడావిడి చేసేస్తుంటారు కొందరు అందాల భామలు. 

ఆ లిస్ట్‌లోకి తాజాగా ఆదాశర్మ చేరిపోయినట్టుంది. తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా సరైన హిట్‌ రావడంలేదు ఈ భామకి. బాలీవుడ్‌లో తాజాగా చేస్తోన్న 'కమాండో 2' సినిమా కోసం ఆదాశర్మ చాలా కష్టాలు పడ్తోంది. శరీరాన్ని ఓ రేంజ్‌లో కష్టపెట్టెస్తోన్న ఆదా శర్మ, తనలోని కొత్త యాంగిల్‌ని అందరికీ పరిచయం చేసేస్తోంది. 

జిమ్నాస్టిక్స్‌ తరహాలో పోజులిచ్చేస్తూ, 'ఇదీ ఆదాశర్మ టాలెంట్‌..' అంటూ సవాల్‌ విసరుతోంది. 'కమాండో 2' సినిమా కోసం ఈ అందాల భామ యాక్షన్‌ సీక్వెన్సెస్‌లో కూడా నటించేస్తుండడం గమనార్హం. తెలుగు ప్రేక్షులకు 'తుపాకీ' సినిమాతో సుపరిచితుడైన విద్యుత్‌ జమ్వాల్‌ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈషా గుప్తా అనే మరో అందాల భామ కూడా ఈ సినిమాలో నటిస్తున్నా, అందరి దృష్టీ ఇప్పుడు ఆదాశర్మ గ్లామర్‌ మీదే పడింది. 

'నాదేమీ జీరో సైజ్‌ ఫిజిక్‌ కాదు.. అలాగని సిక్స్‌ ప్యాక్‌ కూడా కాదు.. కాస్త సన్నబడ్డానంతే.. అదీ ఏ మాత్రం గ్లామర్‌ చెడిపోకుండా..' అంటోంది ఆదా శర్మ. చూద్దాం.. ఈ ఫీట్లు అయినా ఆదా శర్మకి మంచి సక్సెస్‌ తెచ్చిపెడ్తాయో లేదో.!