గ్యారేజ్ రిపేర్లే అసలు కారణమా?

జనతా గ్యారేజ్ ఉన్నట్లుండి దాదాపు ఓ నెల వెనక్కు వెళ్లింది. సరే, ఇప్పుడు అన్నీ పూర్తి చేసుకుని రావడానికి రెడీ అయింది. అయితే యూనిట్ ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి మరీ పనులు…

జనతా గ్యారేజ్ ఉన్నట్లుండి దాదాపు ఓ నెల వెనక్కు వెళ్లింది. సరే, ఇప్పుడు అన్నీ పూర్తి చేసుకుని రావడానికి రెడీ అయింది. అయితే యూనిట్ ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి మరీ పనులు పూర్తి కాలేదని అందుకే మంచి డేట్ మిస్ చేసుకుని, సెప్టెంబర్ లో వినాయక చవితికి ముందు వస్తామని ప్రకటించింది. ఈ కొత్త తేదీ కూడా ఓ విధంగా మంచి డేట్ నే. పెద్దగా పోటీ కూడా లేదు. 

అయితే అసలు ఇంతకీ దగ్గర దగ్గర మూడు వారాలు వెనక్కు వెళ్లడానికి కారణం కేవలం షూటింగ్ పనులు పూర్తి కాకపోవడమేనా? అంటే కాదనే విధంగా కొన్ని గ్యాసిప్ లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. సినిమా ఫైనల్ సాంగ్ పూర్తి చేసే టైమ్ కే హీరో ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పేసారు. ఫస్ట్ హాఫ్ అన్న విధాలా కాపీ రెడీ అయిపోయింది. సెకండాఫ్ కూడా చాలా వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిపోయాయి. మరి మిగిలిన కొద్ది పనులకే మూడు వారాలు పట్టిందా? అన్నది ఓ అనుమానం.  

అది కాదు అసలు రీజన్ అని, సెకండాఫ్ టూ సీరియస్ గా ఎమోషనల్ గా రావడంతో కొన్ని రిపేర్లు చేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే స్పెషల్ సాంగ్ డిజైన్ చేసారని వినికిడి. అంతే కాదు, ముందు అనుకున్నదాని కంటే మోహన్ లాల్ కు ప్రాధాన్యత పెంచారని, సినిమాకు ఆ పాత్రే హైలైట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇలా కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్లనే ఆలస్యం అయిందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఏ మేరకు నిజమో, విడుదల తరువాతే తెలుస్తుంది.