రాజకీయ నాయకుడు కదా..కుమారస్వామి గౌడ అందుకే పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చేసి, కొడుకు హీరోగా నటిస్తున్న జాగ్వార్ సినిమా కు అండగా వుండమని అడిగేసాడు. జాగ్వార్ సినిమాను భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో కన్నడ మార్కెట్ కంటే తెలుగు మార్కెట్ మీదే ఆది నుంచీ కన్నేసినట్లు కనిపిస్తోంది.
టీజర్ ఫంక్షన్ హైదరాబాద్ లోనే ధూమ్ ధామ్ మని చేసారు. ఇప్పటికే తెలుగులో నలభై మంది యువ హీరోలు సినిమాల కోసం కిందా మీదా అవుతున్నారు. ఈ జాబితాలో మరో నెంబర్ కింద చేరడానికి ఈ నిఖిల్ నెంబర్ 2 ప్రయత్నిస్తున్నాడు. అందుకే తండ్రి కుమారస్వామి రంగంలోకి దిగి పవన్ దగ్గరకు వచ్చారు. పవన్ దగ్గరకు వచ్చారంటే మెగా క్యాంప్ దగ్గరకు వచ్చినట్లే.
కానీ టాలీవుడ్ అంటే మెగా క్యాంప్ ఒక్కటే కాదు కదా? ఇక్కడ మరో క్యాంప్ కూడా వుంటుంది. ఈ క్యాంప్ కు పర్టిక్యులర్ గా ఓ పేరు అంటూ లేకపోయినా, దాని బలం, దాని వ్యవహారం, దాని ఎత్తుగడలు దానికి వుంటాయి. కానీ ఆ వర్గానికి ఓ లీడర్ అంటూ లేరు. అందువల్ల కుమారస్వామి ఎవర్ని కలవాలో తెలియక కలియలేకపోవచ్చు.
కానీ ఎక్కడో అక్కడ ఎవర్నో ఒకర్నో ఇద్దరినో కలిసి హాయ్ చెప్పేయడం బెటర్. ఎందుకంటే కలిస్తే రెండు వర్గాలను కలవాలి లేదంటే వదిలేయాలి. అనవసరంగా కనిపించని. లేని పోని తలకాయనోప్పి. రాజకీయాల్లో పండిన కుమారస్వామికి ఆ మాత్రం టాలీవుడ్ రాజకీయాలపై అవగాహన వుండదంటారా? వుండే వుంటుంది.