నెట్ లో వచ్చేసాక ఓవర్ సీస్ రిలీజ్ నా?

బిచ్చగాడు సినిమా విజయాన్ని ఎవరూ ఊహించలేదు, డబ్బింగ్ రైట్స్ కొన్న చదలవాడ శ్రీనివాసరావుతో సహా. ఇది వాస్తవం. కానీ మంచి సినిమాను ఆదరించే ప్రేక్షకులు దాన్ని నెత్తిన పెట్టుకున్నారు. వంద రోజులు ఆడించేసారు. అంతా…

బిచ్చగాడు సినిమా విజయాన్ని ఎవరూ ఊహించలేదు, డబ్బింగ్ రైట్స్ కొన్న చదలవాడ శ్రీనివాసరావుతో సహా. ఇది వాస్తవం. కానీ మంచి సినిమాను ఆదరించే ప్రేక్షకులు దాన్ని నెత్తిన పెట్టుకున్నారు. వంద రోజులు ఆడించేసారు. అంతా బాగానే వుంది. ఇప్పుడు ఈ సినిమాను ఓవర్ సీస్ లో విడుదల చేస్తాం అంటున్నారు నిర్మాత చదలవాడ. 

కానీ ఇప్పటికే బిచ్చగాడు పైరసీ ప్రింట్ నెట్ లోకి వచ్చేసింది. తెలుగునాట కూడా థియేటర్లలకు వెళ్లని వాళ్లు ఎవరైనా వుంటే నెట్ లో చూడ్డం కూడా ప్రారంభించేసారు. మరి అలాంటిది నెట్ లోనే సదా వుండే ఓవర్ సీస్ జనాలు వదల్తారా? రకరకాల యూ ట్యూబ్ చానెళ్లలో ఇప్పటికే లక్షల మంది బిచ్చగాడు సినిమా చూసేసారు. అందువల్ల ఈ ఓవర్ సీస్ ఆలోచన అంత సరైనది కాదేమో ?