పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కి సినీ రంగంలో మరో తమ్ముడు తయారయ్యాడు. అయితే ఈ తమ్ముడు టాలీవుడ్‌కి చెందినోడు కాదు, కన్నడ సినీ పరిశ్రమకు చెందిన యువ హీరో. అతనెవరో కాదు, 'జాగ్వార్' సినిమాతో తెరంగేట్రం చేస్తున్న నిఖిల్. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడే ఈ నిఖిల్. అన్నట్టు నిఖిల్ తాతయ్య, మాజీ ప్రధాని దేవెగౌడ.
ఇప్పుడిదంతా ఎందుకంటే, తన కుమారుడి తెరంగేట్రం నేపథ్యంలో పవన్‌కళ్యాణ్ ఆశీస్సుల కోసం వచ్చినట్లు పవన్‌కళ్యాణ్‌తో భేటీ అనంతరం కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి వ్యాఖ్యానించారు. పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయిన కుమారస్వామి, తమ భేటీ వెనుక రాజకీయ కారణాలేమీ లేవని చెప్పారు. పవన్‌కళ్యాణ్‌కి నిఖిల్ తమ్ముడి లాంటోడనీ, పవన్‌కళ్యాణ్ ఆశీస్సులు నిఖిల్‌కి వుంటాయని నమ్ముతున్నానని కుమారస్వామి చెప్పుకొచ్చారు.
ప్రస్తుతానికైతే టాలీవుడ్‌లో పవన్‌కళ్యాణ్‌కి తమ్ముడు.. అంటే నితిన్ మాత్రమే. అంతలా పవన్‌ని నితిన్ వాడేసుకుంటాడు. తన సినిమాకి సంబంధించి పవన్‌కళ్యాణ్‌ని ఏదో ఒక రకంగా వాడేసుకోవడం నితిన్‌కి అలవాటు. పవన్‌కళ్యాణ్ జపం మొదలు పెట్టాకే నితిన్ కెరీర్ ఊపందుకుంది మరి.! ఇప్పుడు కొత్తగా పవన్‌కళ్యాణ్‌కి ఇంకో తమ్ముడొచ్చాడు. నితిన్‌లా, నిఖిల్ కూడా హీరోగా పవన్ ఆశీస్సులతో నిలదొక్కుకుంటాడా.? వేచి చూడాల్సిందే.