రాధికా ఆప్టే బూతు వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఏడాది క్రితం వచ్చిన 'పర్చెద్' సినిమాలోని సన్నివేశమది. అయితే, ఈ సినిమా కేవలం టొరంటో ఫిలిం ఫెస్టివల్లో మాత్రమే ప్రదర్శితమయ్యింది. ఇప్పుడెందుకు ఈ సీన్ ఇంటర్నెట్లోకి లీక్ అయ్యింది.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. సినిమా యూనిట్‌కి తెలియకుండా లీక్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. పోనీ, ఎవరన్నా పనిగట్టుకుని లీకేజీకి పాల్పడ్డారంటే, చిత్ర యూనిట్ పోలీసులను ఆశ్రయించొచ్చు.
ఇక, ఈ వ్యవహారంపై నటుడు ఆదిల్ హుస్సేన్ గుస్సా అయ్యాడు. 'రాధికా ఆప్టే సెక్స్ సీన్స్' అంటూ ఎందుకు ఇంటర్నెట్లో ప్రచారం చేస్తున్నారని ఆదిల్ హుస్సేన్ అసహనం వ్యక్తం చేశాడు. ఆయన అసహనానికీ కారణం లేకపోలేదు, ఆ సన్నివేశంలో రాధికా ఆప్టేతో కలిసి రెచ్చిపోయింది ఈయనగారే. రాధికతోపాటు తానూ శృంగార సన్నివేశంలో బట్టల్లేకుండా రక్తికట్టించేస్తే, పేరు మాత్రం రాధికకి మాత్రమే వచ్చేస్తుందన్నది ఆదిల్ హుస్సేన్ ఆవేదన. అలా డైరెక్ట్‌గా చెప్పేస్తే బాగోదుకదా.! అందుకే, రాధికా ఆప్టే మీద తెగ అభిమానం కురిపించేశాడు. 'ఆమె మహిళ గనుక, తేలిగ్గా ఆమెను చూస్తున్నారు.. నా పేరుతో సెక్స్ సీన్స్ అని ప్రచారం చేసే ధైర్యం లేదా.?' అని ప్రశ్నిస్తూ, 'ఇది పితృస్వామ్య దేశం' అంటూ నిష్టూరమాడేశాడు.
విడుదలైంది శృంగార సన్నివేశం. బ్లూ ఫిలిం తరహాలో వుంది ఆ సన్నివేశం. ఆదిల్ హుస్సేన్ అంటే ఎంతమందికి తెలుసు.? అదే రాధికా ఆప్టే అంటే అందరికీ తెల్సిన హీరోయిన్ కదా. పేరు ఎవరిదైతేనేం, వీడియో అయితే బయటకు వచ్చేసింది. అప్పుడే హార్డ్‌కోర్ సినిమాల వెబ్సైట్లలోకీ ఈ వీడియో చేరిపోయింది.