టాలీవుడ్‌లో కెరీర్ అటకెక్కాక బాలీవుడ్‌కి వెళ్ళిన ఇలియానా, అక్కడ మొదట్లో గ్లామర్‌కి ప్రాధాన్యత లేని పాత్రల్లోనే కనిపించాల్సి వచ్చింది. కానీ, ఇలియానా బాగానే ఓపిక పట్టింది. అవకాశాల కోసం ఎదురుచూసింది. దర్శక నిర్మాతలతో క్లోజ్‌గా మూవ్ అవుతూ వచ్చింది. బాలీవుడ్ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసింది. ఫొటోసెషన్లతో హీటెక్కించింది. ఎలాగైతేనేం, ఇప్పుడు బాలీవుడ్‌లో ఇలియానాకి సరైన ప్లాట్‌ఫామ్ ఏర్పడింది.
తాజాగా 'రుస్తుం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇలియానా, ఇప్పుడు వరుస అవకాశాల్ని సంపాదించుకుంటోంది. సౌత్‌లోలా బాలీవుడ్‌లో ఎడా పెడా అవకాశాలు వచ్చేయవనీ, ఒక్కో సినిమా కోసం చాలాకాలం ఎదురుచూడాల్సి వస్తుందనీ, అలాగే సినిమాల నిర్మాణానికీ బాలీవుడ్‌లో ఎక్కువ టైమ్ తీసుకుంటారనీ, అందుకే వేగంగా సినిమాలు చేయలేకపోతున్నానని చెబుతోంది ఇలియానా.
ఇప్పటికి, బాలీవుడ్‌లో సరైన ప్లాట్‌ఫామ్ దొరికిందని చెబుతోన్న ఇలియానా, ఇక నుంచి తన కెరీర్‌లో మంచి వేగం కనిపిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ, అక్షయ్‌కుమార్ కలిసి నటిస్తున్న ఓ సినిమాలో ఇలియానాకి ఛాన్సొచ్చింది. ఇది కాకుండా, మరో మూడు సినిమాలు ఓకే అవయ్యాయట. సౌత్‌లో ఛాన్సొస్తే చేస్తానని చెబుతోందిగానీ, సౌత్‌కి డేట్స్ ఇచ్చేంత ఖాళీగా అయితే లేదిప్పుడు ఇలియానా.