షారూక్.. ఇప్పుడైనా దేశానికి క్షమాపణ చెప్పు

అకారణంగా అవమానించడం.. నిందాపూర్వకంగా మాట్లాడటం.. ఎవరో కొంతమంది ముస్లింలు  ఉగ్రవాదులైనంత మాత్రానా.. అందరు ముస్లింలనూ అనుమానించడం, ఆ అనుమానంతో  అవమానించడం! ఇప్పుడు బాలీవుడ్ కింగ్ కాన్ షారూక్ ను బాగా ఇబ్బంది పెడుతున్న  అంశం…

అకారణంగా అవమానించడం.. నిందాపూర్వకంగా మాట్లాడటం.. ఎవరో కొంతమంది ముస్లింలు  ఉగ్రవాదులైనంత మాత్రానా.. అందరు ముస్లింలనూ అనుమానించడం, ఆ అనుమానంతో  అవమానించడం! ఇప్పుడు బాలీవుడ్ కింగ్ కాన్ షారూక్ ను బాగా ఇబ్బంది పెడుతున్న  అంశం ఇది. ఒకసారి కాదు.. వరసగా మూడోసారి అమెరికన్లు ఈ బాలీవుడ్ స్టార్ హీరోని  అవమానానికి గురిచేశారు. గంటల కొద్దీ నిర్భందించి ఇబ్బంది పెట్టారు! భారత్ లో స్టార్ హోదాలో.. ఆల్ మోస్ట్ దైవంలా చూడబడే మనిషికి ఇది ఎంతటి ఎంబరాస్  మెంటో వేరే వివరించనక్కర్లేదు! అహంతో బతికే వాళ్లకు ఇలాంటి అవమానాలు ఎంతటి  అసహనానికి గురి చేస్తాయో చెప్పనక్కర్లేదు! ఆల్ మోస్ట్ రగిలిపోతూ ఉండవచ్చు  కింగ్ ఖాన్ మనసు!

ఈ సందర్భంగా కింగ్ ఖాన్ కు ఒక విషయాన్ని గుర్తు చేయాలి… మరి ఇప్పుడు మీ మనసు  రగులుతూ ఉండవచ్చు ఖాన్.. మరి మీరు.. మిమ్మల్ని సెలబ్రిటీగా, స్టార్ గా మార్చి  అభిమానించుకొంటున్న దేశం మనసు రగిలేలా మాట్లాడారు ఒక రోజు! ఆ రోజున సగటు  భారతీయుడి మనసు ఎంత బాధపడి ఉంటుందో ఇప్పుడు మీకూ ఇప్పుడు అలాంటి బాధే  కలుగుతోంది. అకారణంగా దేశం గురించి అనుచితమైన మాటలు మాట్లాడి నువ్వు భారతీయుల  మనసులను నొప్పించావ్.. అచ్చం అదే థియరీతో అమెరికన్లు నిన్ను అవమానించారు! ఏం తేడా లేదు. 

నిన్ను గుండెల్లో పెట్టుకున్న దేశం తో నువ్వు వ్యవహరించిన తీరు  కంటే.. ముస్లింలతో అమెరికా వ్యవహరిస్తున్న తీరు ఎంతో ఉత్తమం. ఉన్నతం. నిజమే.. భారతదేశంలో కొన్ని అవాంచిత సంఘటనలు జరుగుతున్నాయి. మైనారిటీల మీద ఒకటీ  రెండు చోట్ల దాడులు జరిగే ఉండవచ్చు. ఇలాంటివేమీ కొత్త కాదు! అస్సాంలో ఎక్కడో  బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్లు స్థానిక భారతీయ హిందువులపై దాడులకు  తెగబడ్డారు. ప్రాణాలు తీశారు. అయితే అప్పుడెప్పుడూ షారూక్ లాంటి వాళ్ల మనసులు  భారంగా మారలేదు. దాద్రీ సంఘటన మాత్రమే వీరికి దేశం పై అభిప్రాయాన్ని  మార్చేసింది!

దేశంలో అసహనం పెరిగిపోతోందని షారూక్ కు అనిపించింది! ఒక్క సంఘటన ఆధారంగా  దేశంపై దారుణమైన కామెంట్లు చేశాడు ఈ హీరోగారు. మరి ఈయన ఇలా ప్రవర్తించినప్పుడు.. ఈయన విషయంలో అమెరికన్ల ప్రవర్తనలో ఏం తప్పునట్టు? ఇస్లామిక్ తీవ్రవాదం వల్ల అమెరికా నష్టపోయింది. లక్షల కోట్ల డబ్బును  నష్టపరచుకుంది, వేల మందిని కోల్పోయింది ఆ దేశం. అందుకే ప్రతి ముస్లింనూ  అనుమానిస్తోంది! ఇలాంటి తీరే షారూక్ మనసుకు బాధేస్తోంది. ఎవరో కొంతమంది  ముస్లింలు టెర్రరిస్టులు అయితే.. ప్రతి ముస్లింనూ అనుమానించాలా.. అని వాదించే  ముందు షారూక్ కూడా.. దాద్రీలో జరిగిన ఒక్క సంఘటన ఆధారంగా తను దేశాన్నే  అవమానించేలా మాట్లాడాను అని గుర్తెరిగితే మంచిది.

అమెరికాకు ఇస్లామిక్ టెర్రరిస్టులు కలిగించిన నష్టంతో .. దాద్రీ సంఘటన  ముస్లింలకు కలిగించిన సంఘటనను పోలిస్తే.. అది సముద్రంలో ఇసుమంత. అయితే దాద్రీ  సంఘటన నేపథ్యంలో వంద కోట్ల పై స్థాయి జనాభా ఉన్నదేశం మీదే ‘అసహనం’ ముద్రవేశాడు  ఈ సాయిబు. మరి ఎంతో నష్టపోయిన అమెరికన్లు తనను రెండు గంటల పాటు నిర్భంధించే  సరికి అల్లాడిపోతున్నాడు! ఇదేం లెక్క! ఈ ఆవేదనను పంచుకొంటూ  సినిమానే తీస్తాడు  కాబోలు.

తన మనసుకు బాధకలిగితే ట్విటర్ ద్వారా ఆవేదన పంచుకున్న షారూక్.. తన మాటలతో అదే  ఫాలోయర్లను గతంలో అవమానించాను, దేశంపై అనుచితమైన మాటలు మాట్లాడాను అని  క్షమాపణలు చెప్పుకుంటే.. ఇతడు మతతత్వ వాది కాదు, మనిషి అనిపించుకొంటాడు. మరి  ‘కింగ్ ఖాన్’ కు ఆ మనసుందా?

-బి.జీవన్ రెడ్డి