తేజు కొట్టగలిగితే మెగా మొనగాడే

సైలెంట్‌గా వచ్చి 'సుప్రీం' సినిమాతో హిట్టుకొట్టేశాడు సాయిధరమ్‌ తేజ. 'రేయ్‌' తప్ప, మిగిలిన రెండు సినిమాలు 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' సినిమాలు ఓకే అనిపించినా, కమర్షియల్‌గా లాభాలైతే తెచ్చిపెట్టలేదన్న…

సైలెంట్‌గా వచ్చి 'సుప్రీం' సినిమాతో హిట్టుకొట్టేశాడు సాయిధరమ్‌ తేజ. 'రేయ్‌' తప్ప, మిగిలిన రెండు సినిమాలు 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' సినిమాలు ఓకే అనిపించినా, కమర్షియల్‌గా లాభాలైతే తెచ్చిపెట్టలేదన్న టాక్‌ ఇండస్ట్రీలో వుంది. 'సుప్రీం'తో మాత్రం మెగాస్టార్‌ మేనల్లుడు సాయిధరమ్‌ తేజ, మంచి ప్రాఫిట్సే అందించాడు నిర్మాతకి. అది నిజంగానే సర్‌ప్రైజింగ్‌ విజయం. 

ఇక, ఇప్పుడు 'తిక్క' అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్న తేజు, ఎంత కలెక్ట్‌ చేస్తాడన్నదానిపై టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 'సుప్రీం' వసూళ్ళ నేపథ్యంలో 'తిక్క'కి బాగానే ఖర్చు చేశారట. అదెంత.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే, ఎంత ఖర్చు చేసినా వచ్చేస్తుందంటూ నిర్మాత ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేసేశాడంటూ టాలీవుడ్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇదెంత నిజమోగానీ, 'సుప్రీం'లా 'తిక్క'తో మ్యాజిక్‌ చేయగలిగితే మాత్రం, మెగా కాంపౌండ్‌లో తేజు 'మొనగాడే' అన్పించుకుంటాడు. 

తెలుగు సినిమా మార్కెట్‌ కాస్త వింతగా మారిపోయిందిప్పుడు. కొన్ని సినిమాలు అంచనాలు తప్పేస్తున్నాయి. ఇంకొన్ని ఎలాంటి అంచనాలూ లేకుండా, సంచలనాల్ని సృష్టిస్తున్నాయి. మరి, తేజు 'తిక్క' సినిమాతో ఏం చేస్తాడు.? సక్సెస్‌ కొడితే మాత్రం తేజు రేంజ్‌ అమాంతం పెరిగిపోతుంది. చూద్దాం, ఏం జరుగుతుందో.!