‘ఆక్సిజన్’ అందడం లేదా?

ఆక్సిజన్. జ్యోతీకృష్ణ డైరక్షన్ లో హీరో గోపీ చంద్ చేస్తున్న లేటెస్ట్ మూవీ. ఈ సినిమా షూట్ 70 శాతం వరకు పూర్తయింది. అయితే ఇప్పుడు ఇక్కడే చిన్న పీట ముడిపడిపోయిందని తెలుస్తోంది. ఇప్పటి…

ఆక్సిజన్. జ్యోతీకృష్ణ డైరక్షన్ లో హీరో గోపీ చంద్ చేస్తున్న లేటెస్ట్ మూవీ. ఈ సినిమా షూట్ 70 శాతం వరకు పూర్తయింది. అయితే ఇప్పుడు ఇక్కడే చిన్న పీట ముడిపడిపోయిందని తెలుస్తోంది. ఇప్పటి దాకా తీసిన సినిమాను హీరో గోపీచంద్ చూడలేదట. చూపించమని అడిగి, అడిగి ఇటీవలే చూసినట్లు తెలుస్తోంది. చూసిన సినిమా హీరోకు నచ్చలేదని టాక్. 

దాంతో కథపై మళ్లీ డిస్కషన్లు మొదలయ్యాయట. ఈ స్టేజ్ లో కథపై డిస్కషన్లంటే అంత వీజీ కాదు. అందుకే ఏదో విథంగా హీరో చేత ఓకె అనిపించుకుని, సినిమాను ఏదో విధంగా ఫినిష్ చేసి, విడుదల చేసేయాలని దర్శకుడు గోపీకృష్ణ, ఆయన ఫాదర్, నిర్మాత ఏ ఏమ్ రత్నం ఆలోచన అని గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. 

అయితే ఇటీవలే ఓ ఏవరేజ్ సినిమాను తాను ఇచ్చానని, ఈసారి ఎలాగైనా హిట్ సినిమా ఇవ్వాల్సిందే అని, అందువల్ల రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పేసి, హీరో గోపీచంద్ భీష్మించుకు కూర్చున్నాడని వినికిడి. గోపీచంద్ తో పాటు రాశీఖన్నా, జగపతి బాబు తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.