ఏదైనా సినిమాను మరి కాస్త లేపాలంటే చిన్న గుసగుస ఏదో ఒకటి వుండాలి. దాదాపు అన్ని చిన్న సినిమాలకు పనికి వచ్చే గుసగుస ఒకటి వుంది. ఆ సినిమా హక్కుల కోసం పరాయి భాషల నిర్మాతలు క్యూ కట్టేస్తున్నారన్నదే ఆ గుసగుస. ఇప్పటికి చాలా అంటే చాలా సినిమాలకు ఇలాంటి ఫీలర్లు వినిపించాయి. కానీ ఇప్పటి దాకా ఒక్కటి అయినా మచ్చుకు మెటీరియలైజ్ పాపాన పోలేదు.
అంతెందుకు తెలుగులో సూపర్ హిట్ అయిన ప్రేమ కథాచిత్రమ్ హిందీ హక్కులు అమ్మేసి చాలా కాలం అయింది. అదే ఇంతవరకు తెరకెక్కలేదు. ఇప్పుడు పెళ్లి చూపులు సినిమా వంతు వచ్చింది. మంచి సినిమానే. అతి తక్కువ అంటే సుమారు కోటి రూపాయిల లోపు బడ్జెట్ తో రూపొందించి మంచి కలెక్షన్లు సాధిస్తున్న సినిమానే.
ఓవర్ సీస్ జనాలు సూపర్ అని మెచ్చుకున్న సినిమానే. కానీ ఏకంగా సల్మాన్ ఖాన్ కు నచ్చేసింది, ఆయనే కొనేస్తున్నాడు అంటూ గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. వీటిని ఎవరు పుట్టిస్తున్నారో మరి?