ప్రస్తుతం నైజాం డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ లో హాట్ బేబీ అభిషేక్ పిక్చర్స్. పైగా ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా వచ్చింది. ఇది కాక వేరే ఓ భారీ ప్రణాళిక కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ లకు సంబంబంధించి సమస్త ఎక్విప్ మెంట్ లు ఒకే దగ్గర భారీగా దొరికేలా ఓ సంస్థను వందల కోట్లు పెట్టుబడితో ఏర్పాటు చేయాలని ఈ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
అయితే అభిషేక్ సోలోగా ఇది ఏర్పాటు చేయదని, మరి కొందరు బిగ్ షాట్స్ కూడా ఈ వెంచర్ లో పాలు పంచుకుంటారని వినికిడి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈతరహా వ్యాపారం ఇద్దరి చేతుల్లోనే వుంది. స్టూడియోల్లో వుండే ఎక్విప్ మెంట్ బయటకు రాదు. అందువల్ల ఔట్ డోర్ కు కావాల్సిన వాహనాలు, కెమేరాలు, లైట్లు, ఇలా సెట్ ప్రాపర్టీస్ ప్రతి ఒక్కటీ ఒకే చోట దొరికే వెంచర్ కు ప్లాన్ చేసినట్లు వినికిడి.
దీనికోసం సినిమా అవుట్ స్కర్ట్స్ లో ఎకరాల స్థలం తీసుకుని, అక్కడ స్టాక్ చేయాలన్నిది ఆలోచనగా తెలుస్తోంది. ఈ వెంచర్ లో కొందరు పొలిటికల్ లీడర్లు కూడా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా వున్నట్లు తెలుస్తోంది.