చచ్చిందిగా.. గొర్రె

పాపం, మోడీ మనసులో ఏముందో..బాబు అల్లప్పుడెప్పుడో చేసిన తీవ్రమైన విమర్శలకు ఇప్పుడు ఇలా బదులు తీర్చుకుంటున్నారేమో తెలియదు కానీ, తరచు ఏదో విధంగా బాబును కార్నర్ లోకి నెట్టేస్తున్నారు. హోదా మీద చట్ట సభల్లో…

పాపం, మోడీ మనసులో ఏముందో..బాబు అల్లప్పుడెప్పుడో చేసిన తీవ్రమైన విమర్శలకు ఇప్పుడు ఇలా బదులు తీర్చుకుంటున్నారేమో తెలియదు కానీ, తరచు ఏదో విధంగా బాబును కార్నర్ లోకి నెట్టేస్తున్నారు. హోదా మీద చట్ట సభల్లో కుండ బద్దలు కొట్టేయించిన మోడీ ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశంపై కూడా అదే పని చేయించారు. 

'అబ్బే…నియోజకవర్గాల పెంపు అంశం పరిశీలనలో లేదు, అలాంటి ప్రతిపాదనా లేదు..మరో పదేళ్ల వరకు అలాంటి ఆశలు వద్దు' అనే రేంజ్ లో మంత్రిగారు సమాధానం ఇచ్చేసారు. ఇప్పటికే బయటి నుంచి వచ్చిన వారితో, లోపల వున్నవారితో తెలుగుదేశం పార్టీ సఫకేటింగ్ గా ఫీల్ అవుతోంది. బాబు అనుకూల మీడియా ఎంత కాఫుకాసినా, అక్కడ గొడవలు, అసంతృప్తులు లేకుండా పోలేదు. బయటకు రావడం లేదంతే. 

పైగా బాబుతో పార్టీ జనాలకు ఓ అద్భుతమైన అనుభవం వుంది. బయట నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేయడం అన్నది బాబుకు అలవాటు. పైగా ఇప్పుడు బాబు పార్టీలోకి వచ్చిన వారు సామాన్యులు కాదు. విభజన నేపథ్యంలో, బాబు అనుకూల మీడియా ఓ రేంజ్ లో బాబే కావాలి…బాబే రావాలి..అని భయంకరంగా డప్పేసిన సమయంలో, దానికి ఎదురు ఈది గెల్చిన వారు. 

అంటే వారి వారి నియోజకవర్గాల్లో వారి బలం ఏ రేంజ్ లో వుంటుంది? తెలుగుదేశం అందుకోలేనంత రేంజ్ లో వుంటుంది. అందుకే కదా, అది తెలిసే కదా బాబు వారిని పార్టీలోకి తెచ్చింది. మరి వీరిని కాదని ఇప్పుడున్నవారికి టికెట్ లు ఎలా ఇస్తారు. అలాగే ఇంకా ఆశలు పెట్టుకున్నవారు అనేకమంది వున్నారు..వుంటారు. మరి వారి సంగతేమిటి? పైగా ఇంకా మూడేళ్ల సమయం వుంది. ఇంతకాలం పార్టీలో లుకలుకలు పెరగకుండా వుండాలి, వాటిని అదుపు చేయాలి అంటే కాస్త కష్టమే మరి.