చిన్న కొడుకు అఖిల్ అక్కినేనిని పెద్ద స్టార్ చేయాలనే ఉద్దేశంతో పెద్ద కొడుకు విషయంలో చేసిన పొరపాట్లని రిపీట్ చేయరాదని నాగ్ చాలా కేర్ తీసుకుంటున్నారు. చైతన్య మొదటి చిత్రం కొత్త దర్శకుడితో చేస్తే, అఖిల్ మొదటి సినిమాకి వినాయక్‌ని ఎంచుకున్నారు. అయితే అఖిల్ మొదటి సినిమా కూడా అడ్డం తిరగడంతో ఇంతవరకు అతని రెండో చిత్రం సెట్స్ మీదకి వెళ్లలేదు.
ఫస్ట్ సినిమాని వేరే నిర్మాతలకి ఇచ్చిన నాగార్జున రెండో సినిమాని తన బ్యానర్లోనే చేస్తారని అందరూ అనుకున్నారు. ఇపడు వినిపిస్తోన్న వార్తలని బట్టి అఖిల్ రెండో చిత్రం కూడా బయటి నిర్మాతతోనే ఉంటుందని అనిపిస్తోంది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో ఆకట్టుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక లవ్‌స్టోరీ చేయబోతున్నాడు అఖిల్.
ఈ కథ విని నాగార్జున గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు కానీ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై చేయాలనుకోవడం లేదు. అఖిల్‌తో సినిమా చేయడానికి చూస్తోన్న నిర్మాతల్లో ఒకరికి ఆయన ఈ ప్రాజెక్ట్ అప్పగించబోతున్నారు. నాగచైతన్యతో మనం వరకు తన బ్యానర్లో సినిమా చేయని నాగ్, ఇపడు అఖిల్ విషయంలోను సొంత సినిమా చేయడానికి ఎక్కువ సమయమే తీసుకుంటారేమో మరి.