చిరు సినిమాకు నిర్మాత సమస్య అంటే నమ్మడం కష్టం కదా? పైగా 150 వ సినిమాకు నిర్మాత ఎవరు? కొడుకు రామ్ చరణ్ నే. మరింకేంటి సమస్య? అంటే, వుంది. చిరంజీవి హీరో అయి వుండి, నిర్మాత చరణ్ కాక వేరే వాళ్లు వుండివుంటే పరిస్థితి వేరుగా వుండేదని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు చిరంజీవి అంటే మెగాస్టార్. ఎవర్ని వచ్చి నటించి వెళ్లమన్నా వెళ్లే పరిస్థితి. ఇప్పుడు సీన్ అలా లేదు. ముందు రెమ్యూనిరేషన్ ఫైనల్ కావాలంటున్నారు. దాంతో ఇంతవరకు హీరోయిన్ సెట్ కాలేదు. ఎవర్ని అడిగితే వారే నో అనడమో, చిరు పక్కన కదా అని భారీ రేటు చెప్పడమో జరుగుతోంది. దీంతో వీళ్లు నో అంటున్నారు. అదే నిర్మాత అనేవాడు వేరే వుండి వుంటే, మరో దగ్గర సర్దుబాటు చేసుకుందాం, అని తెగించి ఎంతో కొంతకు ఎవరో ఒక హీరోయిన్ ను తీసుకుని వచ్చి వుండేవారు.
కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. ఇక డైరక్టర్ కానీ ఇతరులు కానీ ఏదైనా ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పాలి అంటే నిర్మాత అనేవాడు వుంటే, సులువుగా వుంటుంది. కానీ ఇక్కడ చరణ్ కావడంతో అంత సులువుగా ఇలా కాదు అలా అని చెప్పకలేకపోతున్నారట. అదెందుకు, ఇదెందుకు అంటే లేదు, అది కావాల్సిందే, ఇది కావాల్సిందే అని క్లియర్ గా గట్టిగా మాట్లాడలేకపోతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోపక్క ఎంతమంది రైటర్లు వర్క్ చేస్తున్నా కామెడీ ఇంకా సరిగ్గా సెట్ కావడం లేదు అని మెగాస్టార్ ఫీల్ అవుతున్నారని వినికిడి. నిర్మాత అనేవాడు లేకపోవడంతో, సినిమా ప్రోగ్రెస్ మీద తొందర లేదు. మెగాస్టార్ స్వంత సినిమా, ఎప్పుడు పూర్తి కావాలనుకుంటే అప్పుడు చేసుకుంటారు, మనకేల తొందర అనే మూడ్ యూనిట్ జనాల్లో కనిపిస్తోందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.