సినిమా అనేది ఓ పిచ్చి..చూసేవాళ్లకు, తీసేవాళ్లకు మాత్రమే కాదు..ఇంకా చాలా మందికి. సినిమా రంగంలో అలాంటి మిడిల్ ఏజ్డ్ మాన్ ఒకాయిన వున్నారు. పాపం, ఆయనకు సినిమా అన్నా, సినిమా ఏక్టర్లన్నా మహా ఇష్టం. ఫలనా హీరో పక్కన్నేను.. ఫలానా హీరోయిన్ పక్కన్నేను అని ఫొటొలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టుకోవడం అన్నా సరదా. ఆయన తన సరదా తీర్చుకోవడానికి కావచ్చు సినిమాలు తీస్తుంటారు.
అక్కడితే ఆగితే ఫరవాలేదు. కానీ కొన్ని సినిమాలకు ఫైనాన్స్ చేస్తుంటారు. కానీ అక్కడే వస్తోంది తకరారు. అలా ఫైనాన్స్ చేసే సినిమాలు అన్నీ డింకీ కొట్టేస్తుంటే ఇచ్చిన ఫైనాన్స్ లు వెనక్కు రావడం లేదట. ఈ మధ్యే విడుదలైన ఓ సినిమాకు ఫైనాన్స్ చేసారు. ఆ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా లో నటించిన హీరోయిన్ తో ఫొటోలు దిగి సరదా తీర్చుకున్నారు. అంతవరకు బాగానే వుంది. కానీ విడుదలకు ముందు ఇస్తానన్న అప్పును నిర్మాత ఇవ్వకపోగా, సినిమా విడుదలకు అడ్డం పడకుండా కోర్టుల ద్వారా కేవియట్ లు కూడా తెచ్చేసుకున్నారట. దీంతో ఆ ఫైనాన్స్ హుష్ కాకీ అయిపోయింది.
సదరు నిర్మాత ఇలా వేరే వాళ్ల సినిమాలకు ఫైనాన్స్ చేసి, పైసా వెనక్కు తెచ్చుకోని వ్యవహారాల్లో ఇది మూడోదో నాలుగోదో అంట. అయినా కూడా హీరో, హీరోయిన్లతో చెట్టాపట్టాలేసుకోవడం, ఫోటోలు తీసుకోవడం అన్న సరదా కోసం ఇలా ఎన్నాళ్లు ఫైనాన్స్ చేస్తుంటారో పాపం.