గ్యారేజ్ విడుదలకు ఓవర్ సీస్ లో సమస్య?

ఆగస్టు 12..ఎన్టీఆర్, కొరటాల శివ అభిమానులు ఎదురుచూస్తున్న డేట. అయితే ఈ డేట్ కు ఓ చిన్న సమస్య వచ్చేలా వుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే డేట్ ను రెండు భారీ…

ఆగస్టు 12..ఎన్టీఆర్, కొరటాల శివ అభిమానులు ఎదురుచూస్తున్న డేట. అయితే ఈ డేట్ కు ఓ చిన్న సమస్య వచ్చేలా వుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే డేట్ ను రెండు భారీ హిందీ సినిమాలు, ఓ మాంచి హాలీవుడ్ సినిమా డేట్ లు కూడా పడేలా వున్నాయట. 

అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా సమస్య రాదు కానీ, ఓవర్ సీస్ లో ప్రాబ్లమ్ కావచ్చని అంటున్నారు. ఈ రెండు హిందీ సినిమాల్లో మొహంజదారో ఒకటి అంట. ఆ సినిమా ట్రయిలర్ ఇటీవల విడుదలైంది. సినిమా అభిమానులు ను భయంకరంగా ఆకట్టుకుంది. 

ఇక అక్షయ్ కుమార్ రుస్తోమ్ కూడా అదే రోజు విడుదలకు ప్లాన్ చేసుకున్నారు. వీటివల్ల ఓవర్ సీస్ లో స్క్రీన్ ల సమస్య కాస్తయినా వుంటుందని, అలాగే ఓవర్ సీస్ రికార్డుకు కాస్త ఇబ్బంది ఎదురవుతుందని అంటున్నారు. అందువల్ల గ్యారేజ్ సినిమా 19కి వెళ్లినా ఆశ్చర్యం లేదంటున్నారు.