రజనీ కాంత్ కబాలి సినిమా డేట్ ఇంకా దోబూచులాడుతూనే వుంది. చెన్నయ్ లో 29 న రిలీజ్ అంటూ భారీపోస్టర్ వేసారని వార్తలు వినవచ్చాయి. అయితే డిస్ట్రిబ్యూటర్లను మాత్రం 22కే ప్రిపేర్ కమ్మని సమాచారం పంపించారని వినికిడి. కానీ 22 కు ప్రిపేర్ కమ్మని సమాచారం అందినట్లు తెలుస్తోంది. మరో పక్క 21న వరల్డ్ ప్రీమియర్ వుంటుందని వార్తలు వెలువడుతున్నాయి.
దీంతో మొత్తం టాలీవుడ్ సినిమాలు అన్నీ అయోమయంలో పడ్డాయి. ఇప్పటికే 14న రెండు సినిమాలు డేట్లు ప్రకటించాయి. నాయకి, సెల్ఫీరాజా సినిమాలు 14న విడుదలవుతున్నాయి. మరి కబాలి 22న వస్తే, వన్ వీక్ కే చాలా ధియేటర్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. ఇది కాస్త సమస్యే. అలా కాకుండా 29న వస్తే ఏ గొడవా లేదు. ఏదయినా పెద్ద సినిమాలు ఇలా ఓ డేట్ అంటూ ఫిక్స్ చేసుకోకుండా, తమ చిత్తానికి డేట్లు మార్చుకుంటూ పోతుంటే, చిన్న, మీడియం సినిమాలకు తలకాయనోప్పే.