నో డౌట్‌.. నయనతారే నెంబర్‌ వన్‌

సౌత్‌ సినీ పరిశ్రమలో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ ఎవరు.? ఈ ప్రశ్నకు అనుష్క పేరే సమాధానంగా చెబుతారు ఎవరైనా. కానీ, అనుష్క కాదు కదా, ఇంకెవరూ తన దరిదాపుల్లోకి రానీయకుండా, టాప్‌ ప్లేస్‌ సొంతం…

సౌత్‌ సినీ పరిశ్రమలో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ ఎవరు.? ఈ ప్రశ్నకు అనుష్క పేరే సమాధానంగా చెబుతారు ఎవరైనా. కానీ, అనుష్క కాదు కదా, ఇంకెవరూ తన దరిదాపుల్లోకి రానీయకుండా, టాప్‌ ప్లేస్‌ సొంతం చేసుకుంది నయనతార. ఔను, నయనతార నెంబర్‌ వన్‌. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. 

నటిగా నయనతారను నెంబర్‌ వన్‌ అనాలా.? వద్దా.? అన్నది కాదిక్కడ విషయం. అసలు విషయమేంటంటే, సౌత్‌లో ఏ హీరోయిన్‌ మీదా లేనన్ని 'గాసిప్స్‌' నయనతార చుట్టూ వినిపించాయి, వినిపిస్తూనే వున్నాయి. అవి కూడా పెళ్ళి గాసిప్స్‌ కావడం గమనార్హం. నయనతారకి గాసిప్స్‌ అంటే భలే ఇష్టం. అందుకే, ఆ గాసిప్స్‌ తయారవడం కోసం 'ముడి సరుకు'ని ఆమే స్వయంగా ప్రిపేర్‌ చేస్తుంటుంది. 

ఏంటీ, అర్థం కావడంలేదా.? ఒకప్పుడు నయనతార, తమిళ హీరో శింబుతో చాలా క్లోజ్‌గా మూవ్‌ అయ్యింది. ఏ స్థాయిలో.? అన్నది అందరికీ తెల్సిన విషయమే. ఆ తర్వాత సీన్‌ ప్రభుదేవా వైపుకు మళ్ళింది. ప్రభుదేవా భార్య రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సి వచ్చింది. దాంతో, ప్రభుదేవా నుంచి నయనతార వేరుపడింది. ఆ తర్వాత లైన్‌లో నిలబడింది తమిళ హీరో ఆర్య. మళ్ళీ అట్నుంచి శింబు వైపు షిఫ్ట్‌ అయ్యింది. ఇప్పుడు దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ దగ్గర ఆగింది. 

ఆసక్తికరమైన విషయమేంటంటే, శింబుతో నయనతార చెట్టాపట్టాలేసుకుని మీడియా ముందుకొచ్చిన కొద్ది రోజులకే ఆ 'వ్యవహారం' చెడింది. ప్రభుదేవా విషయంలోనూ అంతే. తాజాగా విఘ్నేష్‌ శివన్‌, నయనతార కలిసి మీడియా ముదుకొచ్చారు. సో, అతి త్వరలో వీరిద్దరి బేకప్‌ పక్కా అన్నమాట. ప్రేమ గురించి నయనతారని ఇటీవల ఓ సందర్భంలో ప్రశ్నిస్తే, 'నాన్సెన్స్‌' అనేసింది. ప్రేమ మీద అంత గొప్ప అభిప్రాయం వున్నాక, ఇలా 'పెటాకులు' చేసేసుకోవడంలో నయనతార నెంబర్‌ వన్‌ అవడం వింతేమిటట.?