బాలయ్య మదిలో కొండవీటి సింహం

సింహ..అన్న నరసింహస్వామి అన్నా బాలయ్యకు మహా ఇష్టం..అందుకే ఆయనకు నచ్చిన, మనసులో వున్న మరో టైటిల్ కొండవీటి సింహం అని తెలుస్తోంది. ఈ టైటిల్ సీనియర్ ఎన్టీఆర్ సూపర్ డూపర్ హిట్ సినిమాది అన్న…

సింహ..అన్న నరసింహస్వామి అన్నా బాలయ్యకు మహా ఇష్టం..అందుకే ఆయనకు నచ్చిన, మనసులో వున్న మరో టైటిల్ కొండవీటి సింహం అని తెలుస్తోంది. ఈ టైటిల్ సీనియర్ ఎన్టీఆర్ సూపర్ డూపర్ హిట్ సినిమాది అన్న సంగతి తెలిసిందే. ఎర్లీ డేస్ లో బాలయ్య తన తండ్రి నటించిన సినిమాల పేర్లు పెట్టిన చిత్రాలు కొన్ని చేసారు కానీ, ఆ తరువాత ఆయన స్టయిల్ లో ఆయన వెళ్లారు. 

దాదాపు అన్నీ మంచి టైటిల్సే. ఇప్పుడు చేస్తున్నశాతకర్ణి కానీ, రైతు కూడా వైవిధ్యమైనవే. అయితే కొండవీటి సింహం టైటిల్ మీద మాత్రం బాలయ్యకు మక్కువ వుందని తెలుస్తోంది. ఈ టైటిల్ తో ఓ సబ్జెక్ట్ కూడా బాలయ్య దృష్టికి వచ్చిందని, ఆయన ఆలోచిద్దాం అని అన్నారని వినికిడి. రైతు తరువాత ఈ సినిమాకు బాలయ్య ఓకె చెప్పే అవకాశం వుందని తెలుస్తోంది.