ఓ పక్క హీరోయిన్ సమంతతో అక్కినేని నాగచైతన్య ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడంటూ గాసిప్స్ విన్పిస్తున్న సమయంలోనే, అక్కినేని కాంపౌండ్ నుంచి ఇంకో 'లవ్'లీ బాంబ్ పేలింది. ఈసారి వంతు 'సిసింద్రీ' అక్కినేని అఖిల్‌ది. తన 'లవ్' గురించి అఖిల్ స్వయంగా ప్రకటించేసరికి అంతా షాక్‌కి గురయ్యారు. అక్కినేని అఖిల్ ప్రేమిస్తున్నది ఈ అమ్యాయినేనంటూ గాసిప్స్ కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్తున్నాయి.
అన్నట్టు, నాగచైతన్య – సమంత లవ్ ఎఫైర్‌పై ఇంకా అక్కినేని కుటుంబం నుంచిగానీ, సమంత తరఫు నుంచిగానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. సమంత మాత్రం తాను లవ్‌లో పడ్డానని చెప్పింది. అంతే తప్ప, సమంత కూడా తాను నాగచైతన్యను ప్రేమిస్తున్నట్లు క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. అఖిల్ కూడా అంతే, పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పలేదు, ప్రేమిస్తున్నానని అన్నాడంతే.
ఈ రెండు ప్రేమలూ ఒకేసారి పెళ్ళి పీటలెక్కుతాయంటూ తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో గాసిప్స్ గుప్పుమంటున్నాయి. అమలను నాగార్జున ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం విదితమే. సో, ప్రేమ వివాహాలకి అక్కినేని కుటుంబం నుంచి ఎలాంటి అభ్యంతరం వుండకపోవచ్చు. చూద్దాం.. అక్కినేని అభిమానులకి, వారసులు ఒకేసారి 'డబుల్' ధమాకాతో కూడిన గుడ్ న్యూస్ చెబుతారేమో.!