మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా పట్టాలెక్కింది. షూటింగ్ ప్రారంభమయ్యింది. సినిమా స్టిల్స్‌లో చిరంజీవి చాలా కొత్తగా కన్పిస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్ళుగా చిరంజీవి రాజకీయాలకే పరిమితమైపోయారు. మధ్యలో రెండుసార్లు రామ్‌చరణ్ సినిమాల్లోనే తళుక్కున మెరిశారాయన. ఆ సినిమాల కోసం అప్పట్లో కాస్త ఒళ్ళు తగ్గించినప్పటికీ, ఇదివరకటిలా స్లిమ్‌గా మాత్రం కన్పించలేకపోయారు.
ఇక, కొత్త సినిమా కోసం మాత్రం చిరంజీవి చాలా కసరత్తులే చేసినట్లున్నారు. కొద్ది రోజుల క్రితమే ఓ అవార్డ్స్ ఫంక్షన్‌లో కన్పించిన చిరంజీవి, కాస్త లావుగానే వున్నా, అనూహ్యంగా ఆయన ఇప్పుడు స్లిమ్‌గా కనిపిస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. చిరంజీవిలో స్పెషాలిటీ అదే.
'ఠాగూర్' సినిమానే తీసుకుంటే, అందులో చిరంజీవి పాటల్లో ఒకలా, మిగతా సన్నివేశాల్లో ఇంకొకలా వుంటారు. పాటల్లో స్లిమ్‌గా వుండడం కోసం, పాటల షూటింగ్‌కి ముందు ప్రత్యేకమైన డైట్ ఫాలో అవడం చిరంజీవికి మొదటినుంచీ అలవాటు. అయినప్పటికీ, రోజుల వ్యవధిలోనే చిరంజీవి తన శరీరాన్ని స్లిమ్‌గా మార్చేసుకోవడమే ఎలాగనేది ఎవరికీ అర్థం కావడంలేదు. ఇందులో కెమెరా ట్రిక్ ఏమైనా వుందా.? చిరంజీవి నిజంగానే సన్నబడ్డారా.? ఏమో మరి, ఆయనకే తెలియాలి.
ఒక్కటి మాత్రం నిజం.. సెట్స్‌లో చిరంజీవిని స్లిమ్‌గా చూస్తున్న అభిమానులు, తమ అభిమాన హీరో తెరపై డాన్సులు, ఫైట్లు ఇరగదీసేస్తాడని విశ్వసిస్తున్నారు. చూద్దాం, కొత్త సినిమాలో చిరంజీవి 'కత్తి'లా కనిపిస్తారో లేదో.!