చరణ్ తో పవన్ సినిమా ఎప్పుడు?

అబ్బాయ్ చరణ్ తో ఓ సినిమా నిర్మిస్తా అని ప్రకటించాడు బాబాయ్ పవన్? ఇలా ప్రకటించి చాలా నెలలు దాటింది? మరి ఈ సినిమా ఎప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. బ్రూస్ లీ…

అబ్బాయ్ చరణ్ తో ఓ సినిమా నిర్మిస్తా అని ప్రకటించాడు బాబాయ్ పవన్? ఇలా ప్రకటించి చాలా నెలలు దాటింది? మరి ఈ సినిమా ఎప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. బ్రూస్ లీ ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నాక, ఇప్పుడిప్పుడే రామ్ చరణ్ మరొ సినిమాను టేకప్ చేసాడు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో. 

అది పూర్తయ్యాకే మరో సినిమా చేస్తాడు. థనీ ఒరువన్ ప్రాజెక్ట్ ను తన చేతిలోకి తీసుకున్నందుకు గాను, నిర్మాత దానయ్యకు మరో సినిమా చేయాల్సి వుంది. మరి ఈ సినిమా అయ్యాక దానయ్య సినిమా చేస్తే, పవన్ తో సినిమా ఎప్పుడు? అంటే ఈ లెక్కన రామ్ చరణ్ హీరోగా పవన్ నిర్మాతగా సినిమా రావాలి అంటే మరో ఏడాది ఆగాల్సి వుంటుందేమో? ఈలోగా పవన్ ఇతరత్రా బిజీ కాకుండా వుండాలి..అలాగే రామ్ చరణ్ ఫ్రీ అవ్వాలి. కాస్త టైమ్ పట్టేలాగా వుంది.