ఉరిమి ఉరిమి మంగలం మీద పడినట్లుంది వ్యవహారం. వందో సినిమా చేసున్న బాలయ్య బాగానే వున్నారు. ఆ ప్రాజెక్టును సంపాదించిన క్రిష్ అంతకన్నా బాగున్నారు. మధ్యలో సాయి కొర్రపాటికి వచ్చింది సమస్య. బాలయ్యతో సాయికి వున్న సాన్నిహిత్యం, ఆది నుంచీ బాలయ్య వందో సినిమా ఆయనే 14 రీల్స్ తో కలిసి నిర్మిస్తారన్న ప్రచారం కలిసి, బోలెడు గ్యాసిప్ లకు తెరతీసాయి. బాలయ్య తన వందో సినిమా సాయికి 14 రీల్స్ కు ఇవ్వలేదని, హ్యాండ్ ఇచ్చారనీ, కాదు క్రిష్ సినిమాలో సాయి కూడా పార్టనర్ అని ఇంకా చాలా చాలా.
ఇవన్నీ సాయి కొర్రపాటికి 14 రీల్స్ కు చాలా ఎంబ్రాసింగ్ గా తయారయ్యాయని వినికిడి. బాలయ్య మానాన ఆయన వందో సినిమా చేసుకుంటున్నారు.. తన మానాన తన సినిమా తాను చేస్తున్నారు.. మధ్యలో ఈ వదంతులేంటీ అని ఆయన సన్నిహితుల దగ్గర వాపోతున్నారట.
నిజానికి సాయి కొర్రపాటి బాలయ్య వందో సినిమా నిర్మించాలని అనుకున్న మాట వాస్తవం. అదే కాదు, ఎప్పుడు బాలయ్య సై అన్నా ఆయనతో సినిమా నిర్మించడానికి ఈయన రెడీ. అయితే సమస్య ఏమిటంటే.. డైరక్టర్ క్రిష్, టోటల్ ప్రాజెక్టును తామే టేకప్ చేస్తామని అడిగారు. అలా అయితేనే తనకు కంఫర్ట్ గా వుంటుందని ఆయన అన్నారు. దాంతో బాలయ్య ఓకె అనేసారు.
అంతకు మించి అక్కడ జరిగిందేమీ లేదు. కానీ వార్తలన్నీ ఇక సాయి కొర్రపాటి, 14 రీల్స్ ఏకంగా బాలయ్య క్యాంప్ లోంచి తప్పుకున్నారన్న రేంజ్ లో వచ్చాయి. దీంతో వీటిని ఎలా కౌంటర్ చేయాలి? అసలు చేయాలా? వద్దా? అని సాయి కొర్రపాటి తల పట్టుకున్నారని వినికిడి.