బన్నీకి మారుతి న్యూమరాలజీ

బన్నీ కొత్త సినిమా ఫస్ట్ లుక్ లాంటి ప్రీ లుక్ బయటకు వచ్చింది. అయితే ట్విట్టర్, ఫేస్ బుక్ ఇలా అన్ని చోట్లా సరైనోడు సినిమా ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో ఓ ఆర్ ఎక్కువ…

బన్నీ కొత్త సినిమా ఫస్ట్ లుక్ లాంటి ప్రీ లుక్ బయటకు వచ్చింది. అయితే ట్విట్టర్, ఫేస్ బుక్ ఇలా అన్ని చోట్లా సరైనోడు సినిమా ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో ఓ ఆర్ ఎక్కువ కనిపిస్తోంది. దీని వెనుక సమ్ థింగ్..సమ్ థింగ్ అని డిస్కషన్లు, వార్తలు మొదలయ్యాయి. అయితే దీనివెనుక న్యూమరాలజీ లెక్కలు వున్నాయంటున్నారు. 

అంతే కాదు, న్యూమరాలజీ ప్రకారం దీనికి ఓ ఆర్ ఎక్కువ తగిలించింది దర్శకుడి మారుతి సలహా అని ఓ గ్యాసిప్ వినిపిస్తోంది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, దర్శకుడు మారుతికి న్యూమరాలజీ మీద నమ్మకమే కాదు, ప్రవేశం కూడా బాగా వుందని.

పైగా బన్నీకి మారుతి ఆప్తుడు కమ్ సన్నిహితుడు కూడా. అందుకే సరైనోడు ఇంగ్లీష్ టైటిల్ కు లెక్కలు కట్టి, ఓ ఆర్ ను చేర్చమని మారుతి సలహా ఇచ్చారన్నది టాలీవుడ్ లో వినిపిస్తున్న సంగతి. ఎంతవరకు నిజమో మరి.