పూరీ.. పవన్ ఫ్యాన్స్ విషయంలో నష్టనివారణ చర్యలు!

'లోఫర్' సినిమాను బహిష్కరించాలని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నిర్ణయించుకున్నట్టుగా ఒకవైపు వార్తలొస్తున్నాయి.. ఇక ఇదే సమయంలో… లోఫర్ సినిమా విడుదల అయ్యే థియేటర్ల వద్ద పవన్ ఫ్యాన్స్ గొడవలకు కూడా దిగే అవకాశం ఉందన్న…

'లోఫర్' సినిమాను బహిష్కరించాలని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నిర్ణయించుకున్నట్టుగా ఒకవైపు వార్తలొస్తున్నాయి.. ఇక ఇదే సమయంలో… లోఫర్ సినిమా విడుదల అయ్యే థియేటర్ల వద్ద పవన్ ఫ్యాన్స్ గొడవలకు కూడా దిగే అవకాశం ఉందన్న అంచనాలూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించినట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాను మెగా ఫ్యాన్స్ కూడా పట్టించుకోకూడదని నిర్ణయించారు… వరసగా జరిగిన పరిణామాలతో వారు ఇలా వ్యవహరించనున్నారన్న వార్తల నేపథ్యంలో పూరీ స్పందన ఆసక్తికరంగా ఉంది. 

పవన్ కల్యాణ్ తనకు దేవుడు అని పూరీ వ్యాఖ్యానించాడు. 'హాయ్ ల్యాండ్' జరిగిన ఆ సినిమా ఆడియో సక్సెస్ మీట్ లో పూరీ ఈ విధంగా పవన్ భజన చేశాడు. చాలామందికి పవన్ కల్యాణ్ అభిమాన హీరో మాత్రమే అని.. తనకు మాత్రం ఆయన ఒక దేవుడు అని పూరీ చెప్పుకొచ్చాడు. ఈ మాటలతో అభిమానులను కూల్ చేసే యత్నం చేసినట్టుగా ఉన్నాడు పూరీ. లోఫర్ సినిమా ఆడియో విడుదల వేడుకలో.. పవన్ అభిమానుల తీరుపై పూరీ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వారు తీరు మార్చుకోవాలని పూరీ సూచించాడు. కనీసం పవన్ కల్యాణ్ అయినా తన అభిమానులకు కాస్త బుద్ధి చెప్పాలన్నట్టుగా పూరీ మాట్లాడాడు. 

ఇలాంటి నేపథ్యంలో పవనిజం ఫ్యాన్స్ కు పూరీపై కోపమొచ్చింది. తమకే క్లాసులు పీకుతున్న పూరీ సినిమాను బహిష్కరించాలని, అందులో మెగా కుటుంబానికి చెందిన హీరోనే నటిస్తున్నప్పటికీ దాన్ని పట్టించుకోకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పవన్ అభిమానులు. మరి వారి ఆగ్రహం తమ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుందన్న భయం మొదలైనట్టుంది పూరీకి. అందుకే సినిమా విడుదల దగ్గరపడుతున్న సమయంలో.. పవన్ ను ఏకంగా దేవుడు అనేశాడు. మరి దీంతో అభిమానులు కూడా 'లోఫర్' ను బహిష్కరించే నిర్ణయాన్ని వెనక్కు తీసుకొంటారేమో చూడాలి!