శృతి లక్కీ గర్ల్

మొత్తానికి శృతి హాసన్ మరో విజయాన్ని తెలుగులో నమోదు చేసుకుంది. అనగనగా ఓ ధీరుడు, రామయ్యా వస్తావయ్యా చేదు అనుభవాల్ని ఇచ్చినా, బలుపు, ఎవడు, గబ్బర్ సింగ్, రేసుగుర్రం, శ్రీమంతుడు అన్నీ బంపర్ హిట్లే.…

మొత్తానికి శృతి హాసన్ మరో విజయాన్ని తెలుగులో నమోదు చేసుకుంది. అనగనగా ఓ ధీరుడు, రామయ్యా వస్తావయ్యా చేదు అనుభవాల్ని ఇచ్చినా, బలుపు, ఎవడు, గబ్బర్ సింగ్, రేసుగుర్రం, శ్రీమంతుడు అన్నీ బంపర్ హిట్లే.

పవన్ కు ఫ్లాపుల తరువాత గబ్బర్ సింగ్ ఓ రేంజ్ హిట్ గా మారింది.  బలుపు రవితేజకు ఊపు ఇచ్చింది. అప్పటి వరకు ఫ్లాపులు చవి చూసిన రవితేజ మళ్లీ హిట్ ల వైపు మళ్లాడు. రేసుగుర్రం అల్లు అర్జున్ రేంజ్ ను అమాంతం పెంచేసింది. ఇప్పుడు రెండు ఫ్లాపుల తరువాత మహేష్ కు పెద్ద హిట్ గా శ్రీమంతుడు నిలిచింది.

ఎవడు కూడా రామ్ చరణ్ కు మంచి సినిమా. ఇలా ఎన్టీఆర్ కు మినహా అందిరికీ గోల్డెన్ లెగ్ గా మారింది శృతి. పివిపి సినిమాలో వేయాల్సి వుంది. కానీ లాస్ట్ మినిట్ లో తప్పుకుంది. మరి మళ్లీ తెలుగులో ఎవరితో చేస్తుందో? ఎవరికి లక్కీ గర్ల్ గా మారుతుందో?