ఆయన టాలీవుడ్ లో ఒకప్పుడు పాపులర్ హీరో. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు..తండ్రి పాత్రలు గట్రా వేసుకుంటున్నారు. ఇటీవల పాపం ఆయన ఏదో పని మీద బెంగుళూరు వెళ్లారు. విమానంలోకి అనుమతించడానికి ఇంకా అరగంట టైమ్ వుండడంతో, విఐపి లాంజ్ లో విశ్రమించారు.
ఈలోగా విమానంలోకి అనుమతించడం ప్రారంభమైంది. దాంతో దాదాపు వంద మంది ప్రయాణీకులు క్యూ కట్టేసారు. ఈయన గారు విఐపి లాంజ్ లోంచి వచ్చేసరికే క్యూ చాంతాడంత అయిపోయింది. ఈయనేమో మెల్లగా క్యూలో కాకుండా పక్కనుంచి నేరుగా వచ్చేసి, బోర్డింగ్ పాస్ సిబ్బందికి ఇవ్వబోయారు.
ఆ సిబ్బంది..చాలా మర్యాదగా..లైన్ కేసి చూపించి, ఫాలో ది క్యూ అన్నారు..హ్హి..హ్హి..హ్హి అని తన స్టయిల్ నవ్వొకటి విసిరి, క్యూలో చేరి పావుగంటకు పైగా లైన్లోవుండి విమానం ఎక్కారు. ఒక ఊరు రాజు మరో ఊర్లో బంటు అంటే ఇంతేమరి. మన ఎయిర్ పోర్టులో అయితే గుర్తు పట్టి మర్యాద చేసేవారేమో.. బెంగుళూరులో కదా..అదీ సమస్య.