మొత్తానికి నాగచైతన్య తన తరువాత సినిమాగా ప్రేమమ్ ను ఫిక్సయిపోయినట్లే. దాని హక్కుల వ్యవహారం కూడా దాదాపు సెటిల్ అయిపోయింది. వన్స్ అగ్రిమెంట్ జరిగితే స్క్రిప్ట్ మీద పడతారు.
ఎందుకంటే, ప్రేమమ్ మలయాళ సినిమాను యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకువచ్చి, తెలుగు ప్రేక్షకులను సంతృప్తి పరచడం కష్టం కావచ్చు. అందుకే దాన్ని కాస్త అటు ఇటు మార్చాల్సి వుంటుంది. పైగా దీనికి ముగ్గురు కథానాయకులు, ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇవన్నీ చేకూరాలి.
అందువల్ల మొత్తం కసరత్తు జరిగి సెట్ మీదకు వెళ్లడానికి కాస్త సమయం పట్టే అవకాశం వుంది. బహుశా సెప్టెంబర్ నెలాఖరులో, దసరా నాటికో షూటింగ్ పార్ట్ మొదలవుతుంది. ప్రేమమ్ సినిమా హక్కులను కోటికి పైగా చెల్లించి తీసుకున్నట్లు టాలీవుడ్ బోగట్టా. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకుడు.