బాలకృష్ణ మాంచి జోష్ మీద వున్నారు. అసలే ఎమ్మల్యే అయ్యారు. మరో పక్క సినిమాలు చేస్తున్నారు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసేసారు. ఇప్పుడు తాతయ్య కూడా అయ్యారు. అల్లుడు ఏకంగా రాష్ట్రాన్నే శాసించే వారసత్వాన్ని అందుకుంటున్నారు. ఇంకేం కావాలి. ఇప్పుడు బాలయ్యకు రెండు అకేషన్లు వరుసగా కలిసివచ్చాయి.
Advertisement
గురువారం ఆయన తాజా సినిమా లయన్ ఆడియో ఫంక్షన్ జరిగింది. రేపు అంటే శుక్రవారం నాడు మనవడి బారసాల కార్యక్రమం వుందట. చంద్రబాబు, బాలయ్య లాంటి తాతలకు ముద్దుల మనవడు. మరి ఏం పేరు పెడతారో..బంధువుల నడుమ ఎంత ఘనంగా చేస్తారో?