సత్యమూర్తి సినిమా కథకు సంబంధించి గ్రేట్ ఆంధ్ర అనేక అప్ డేట్స్ అందిస్తూ వచ్చింది. సినిమా కథ, పాత్రలు, వాటి నేపథ్యం, ఇలా చాలా విషయాలు వెల్లడించింది. సినిమా విడుదల కాకముందు అవి కాకమ్మ కబుర్లు అనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా విడుదలయ్యాక, అవన్నీ కరెక్ట్ అని వెల్లడయింది.
మొదటి పదిహేను నిమిషాల్లోనే ప్రకాష్ రాజ్ పాత్ర ముగియడం, వెన్నెల కిషొర్ పిచ్చి వ్యవహారం, ప్రేమించిన అమ్మాయి పెళ్లికే వెడ్డింగ్ ప్లానర్ గా రావడం, ఉపేంద్ర మద్రాసీ నేపథ్యం, ఉపేంద్ర ఇంట్లో శ్రీను వైట్ల టైపు డ్రామా నడవడం, ఇలా ప్రతి ఒక్కటి వెల్లడించింది. ఇప్పుడు అవన్నీ నిజాలే అని సినిమా విడుదలయ్యాక స్పష్టమయింది.