శ్రీమంతుడికి బుక్ మై షో సెన్సార్?

సెన్సార్ సర్టిఫికెట్ సాధారణంగా బోర్టు అందిస్తుంది. కానీ శ్రీమంతుడు సినిమాకు బుక్ మై షో సైట్ యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్లుంది. ఎందుకంటే ఇప్పటి వరకు శ్రీమంతుడు సినిమాకు సెన్సారు అయినట్లు ఎక్కడా వార్తలు కానీ,…

సెన్సార్ సర్టిఫికెట్ సాధారణంగా బోర్టు అందిస్తుంది. కానీ శ్రీమంతుడు సినిమాకు బుక్ మై షో సైట్ యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్లుంది. ఎందుకంటే ఇప్పటి వరకు శ్రీమంతుడు సినిమాకు సెన్సారు అయినట్లు ఎక్కడా వార్తలు కానీ, ప్రెస్ నోట్ కానీ రాలేదు. కానీ బుక్ మై షో సైట్ మాత్రం శ్రీమంతుడు పోస్టర్, దానిపై యు/ఎ సర్టిఫికెట్ వేసి మరీ టిక్కెట్ల అమ్మకం ప్రారంభించేసింది.

సాధారణంగా ఆన్ లైన్ లో టిక్కెట్ లు అమ్మే సంస్థలు కానీ, ఐనాక్స్ వంటి సైట్ లు కానీ, సెన్సార్ సర్టిఫికేషన్ రాకుండా టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభించవు. కానీ శ్రీమంతుడు టికెట్ లకు వున్న డిమాండ్ ఇంతా అంతా కాదు. అందుకే టిక్కెట్ల అమ్మకాలు ముందేప్రారంభించేసినట్లుంది.

కానీ సెన్సారు కాలేదు కనుక, ఎలాగూ ఇలాంటి సినిమాలకు యు/ఎ కామన్ అనుకుని, పోస్టర్ మీద పెట్టేసి వుంటుంది. ఎ సర్టిఫెకెట్ ఎలాగూ తీసుకోరు..యు ఎలాగూ ఇవ్వరు. అందుకే యు/ఎ ను బుక్ మై షో ఫిక్స్ చేసి వుంటారు.