ఎఎన్నార్ స్మారకస్థూపం ఎక్కడ? ఎప్పుడు?

టాలీవుడ్ కు అసలు సిసలైన లెజెండ్ లలో ఒకరైన అక్కినేని నాగేశ్వర రావు మరణించి అప్పుడే నెలలు దాటుంతోంది. ఆయన అంతిమ సంస్కారాలు అన్నపూర్ణ స్టూడియో లో జరిగాయి. ఎన్టీఆర్ నటుడిగా కాక, ముఖ్యమంత్రిగా…

టాలీవుడ్ కు అసలు సిసలైన లెజెండ్ లలో ఒకరైన అక్కినేని నాగేశ్వర రావు మరణించి అప్పుడే నెలలు దాటుంతోంది. ఆయన అంతిమ సంస్కారాలు అన్నపూర్ణ స్టూడియో లో జరిగాయి. ఎన్టీఆర్ నటుడిగా కాక, ముఖ్యమంత్రిగా పనిచేసి మరణించడం, ఆ తరువాత ఆయన పార్టీ ప్రభుత్వం వుండడంతో హైదరాబాద్ నడి బొడ్డున మాంచి స్మారక సమాధి నిర్మించారు. పక్కన మంచి పార్క్ నిర్మించారు. 

పైగా ఎఎన్నార్ మరణించాక హైదరాబాద్ తెలంగాణలో చేరింది. టాంక్ బండ్ మీద ఆంధ్రోళ్ల విగ్రహాలే ఎందుకు అంటున్న నాయకులు హైదరాబాద్ లో ఎఎన్నార్ స్మారకం ఏర్పాటు చేస్తారని ఆశించడం కాస్త అత్యాశే. పైగా నాగార్జనను గతంలో 'గ్రేట్ ఆంధ్ర' ఈ విషయమై ప్రశ్నించినపుడు ప్రభుత్వం చేయడం మనకెందుకు, మనమే చేద్దాం..ఎక్కడా, ఎలా అన్నది ఆలోచిస్తున్నా అన్నారు. మరి ఆ ఆలోచన ఎంతవరకు వచ్చిందో తెలియలేదు. 

ఇక ఆంధ్ర ప్రభుత్వం కూడా అక్కినేని ఊసు పట్టనట్లే వుండిపోయింది. కృష్ణ జిల్లాలోనో, గుడివాడలోనో ఎఎన్నార్ స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తే బాగానే వుంటుంది. కానీ ఆ దిశగా ఎవరూ ఆలోచన చేయడం లేదు. మరోపక్క అన్నపూర్ణలో అక్కినేని అంతిమ సంస్కారాలు జరిగిన చోటునైనా కాస్త పవిత్రంగా, చిన్న పార్కు మాదిరిగా మార్చాలని, అక్కడ షూటింగ్  లు జరగకుండా, కాళ్లతో తొక్కేయకుండా చూడాలని అక్కినేని అభిమానుల కోరుతున్నారు. మరీ నాగ్ ఏమంటారో?