వద్దన్న అనూప్ ముద్దయ్యాడు

రభస సినిమాకు అనూప్ సంగీతం దర్శకుడు. తప్పేం రాయలేదు. సినిమా తొలినాళ్లలో. కానీ ఎన్టీఆర్ పట్టుబట్టి తనకు థమనే కావాలని కోరినట్ల అప్పట్లో వార్తలు వచ్చాయి. నిజమో, అబద్దమో, మొత్తానికి అనూప్ అవుట్. థమన్…

రభస సినిమాకు అనూప్ సంగీతం దర్శకుడు. తప్పేం రాయలేదు. సినిమా తొలినాళ్లలో. కానీ ఎన్టీఆర్ పట్టుబట్టి తనకు థమనే కావాలని కోరినట్ల అప్పట్లో వార్తలు వచ్చాయి. నిజమో, అబద్దమో, మొత్తానికి అనూప్ అవుట్. థమన్ ఇన్. ఎప్పటిలాగే తన పేరు నిలబెట్టుకుంటూ థమన్ సేమ్ టు సేమ్ సంగీతం ఇచ్చి, సినిమా ఫ్లాప్ కావడంలో తన వంతు పాత్ర విజయవంతంగా పోషించాడు. 

దానికే కాదు. ఆగడు, పవర్ కు కూడా థమన్ ఇచ్చిన డబ్బులు దండుగ అనిపించుకున్నాడు. ఆగడు కు ఒకేసారి కోటి పాతిక లక్షలు సింగిల్ పేమెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫలితం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ సినిమా షురూ అయింది. పూరి దర్శకుడు. 

ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ ను ఫిక్సయ్యారు. ముందు దేవీ అనుకున్నారు. కానీ మరి ఎందుకో అనూప్ ను ఎంచుకున్నారు. జాగ్రత్తగా చేయించుకుంటే అనూప్ మంచి ట్యూన్లే ఇస్తాడు. కానీ హీరోలను పాంపర్ చేయడం, వాళ్ల చేత కీచుగొంతుకలతో పాటలు పాడించడం లాంచి థమన్ స్టయిల్ వేషాలు వేయలేడు.