‘పిల్ల’ కాస్త స్పీడ్‌ పెంచాల్సిందే

అనూహ్యంగా దూసుకొచ్చేశారు తెలుగు తెరపైకి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రాశి ఖన్నా. తక్కువ సినిమాలతోనే ఎక్కువ పాపులారిటీ వచ్చేసింది వీరిద్దరికీ. వీరిద్దరితో పోల్చితే రెజినా కాస్త సీనియర్‌. గ్లామరుంది, టాలెంట్‌ వుంది. కాస్తో కూస్తో…

అనూహ్యంగా దూసుకొచ్చేశారు తెలుగు తెరపైకి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రాశి ఖన్నా. తక్కువ సినిమాలతోనే ఎక్కువ పాపులారిటీ వచ్చేసింది వీరిద్దరికీ. వీరిద్దరితో పోల్చితే రెజినా కాస్త సీనియర్‌. గ్లామరుంది, టాలెంట్‌ వుంది. కాస్తో కూస్తో అదృష్టమూ వుంది. కానీ, ఎందుకో రెజినా స్టార్‌ హీరోయిన్ల రేసులో దూసుకుపోవడంలేదు.

రకుల్‌ ప్రీత్‌సింగ్‌ విషయానికొస్తే ఎన్టీఆర్‌, చరణ్‌లతో సినిమాలకు కమిట్‌ అయ్యిందీ అందాల భామ. రాశి ఖన్నా 'జిల్‌'తో అందుకున్న సక్సెస్‌ పుణ్యమా అని ఆమెకీ యంగ్‌ హీరోలతో నటించేందుకు అవకాశాలు పోటెత్తుతున్నాయట. మధ్యలో రెజినా గురించి పట్టించుకోవడమే మానేశారు టాలీవుడ్‌లో.

'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాతో వచ్చిన సక్సెస్‌ని క్యాష్‌ చేసుకోవడంలో రెజినా విఫలమయ్యిందనే చెప్పాలి. ప్రస్తుతం 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' సహా ఒకటీ అరా సినిమాల్లో నటిస్తోన్న రెజీనా, తమిళ సినిమాలకు ఒప్పుకుని టాలీవుడ్‌ని కాస్త పక్కన పెట్టడంతోనే ఆమెను టాలీవుడ్‌ దర్శక నిర్మాతలు లైట్‌ తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇకనైనా రెజీనా పరిస్థితుల్ని అర్థం చేసుకుని, అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నించకపోతే కష్టమే.