రాజమౌళికి నచ్చింది

రాజమౌళి అజాతశతృవులా వుండాలనకుంటారు. ఎవరినీ నొప్పించరు. పైగా సాయి కొర్రపాటి సినిమా అంటే ఆయన స్వంత బ్యానర్ కింద లెక్క. పైగా దర్శకత్వం వహించింది శిష్యుడు త్రికోటి. అందువల్ల ‘దిక్కులు చూడకు రామయ్యా’ సినిమా…

రాజమౌళి అజాతశతృవులా వుండాలనకుంటారు. ఎవరినీ నొప్పించరు. పైగా సాయి కొర్రపాటి సినిమా అంటే ఆయన స్వంత బ్యానర్ కింద లెక్క. పైగా దర్శకత్వం వహించింది శిష్యుడు త్రికోటి. అందువల్ల ‘దిక్కులు చూడకు రామయ్యా’ సినిమా ఆయనకు నచ్చకుండా ఎందుకుంటుంది?

కానీ ఈ ముక్క రాజమౌళి చాలా మనస్పూర్తిగా చెప్పాడట. ‘నేను ఇప్పడు ఏం చెప్పినా, యూనిట్ ను చూసి, నిన్ను చూసి చెప్పాడంటారు..కానీ నాకయితే సినిమా లో ఎమోషన్లు క్యారీ చేసిన విధానం అద్భుతంగా నచ్చేసింది’ అన్నాడట. ఈ సంగతి త్రికోటి తన సన్నిహితులకు చెప్పి, తనకు అంతకన్నా గొప్ప కాంప్లిమెంట్ ఇంకేం కావాలి, అని అంటూ, మురిసిపోతున్నాడట. చాలా టిపికల్ సబ్జెక్ట్, కానీ సున్నితంగా, నీట్ గా డీల్ చేసిన విధానం బాగుంది అని కూడా రాజమౌళి ప్రశంసించాడట.