కోన పై డైరక్టర్లకు కోపం?

దర్శకుడు..రచయిత..నిర్మాత..ఇలా చాలా విద్యలందు ఆరితేరిన కోన వెంకట్ అంటే ఇప్పుడు కొందరు దర్శకులు లోలోపల కోపంగా వున్నారట. ఇటీవల కోన మాట్లాడతున్న తీరే ఇందుకు కారణం అని తెలుస్తోంది. బ్రూస్ లీ..అఖిల్ సినిమాల్లో కోన…

దర్శకుడు..రచయిత..నిర్మాత..ఇలా చాలా విద్యలందు ఆరితేరిన కోన వెంకట్ అంటే ఇప్పుడు కొందరు దర్శకులు లోలోపల కోపంగా వున్నారట. ఇటీవల కోన మాట్లాడతున్న తీరే ఇందుకు కారణం అని తెలుస్తోంది. బ్రూస్ లీ..అఖిల్ సినిమాల్లో కోన వెంకట్ కూడా పార్ట్ గా వున్నారు. ఈ రెండు ఇటీవలి కాలంలో మేజర్ డిజాస్టర్లు. అయితే ఈ పాపంలో తనకు ఏ మాత్రం భాగం లేదని కోన భావిస్తున్నారు. సినిమా రంగంలో కాదు, ఏం రంగంలో అయినా పరాజయం అనాథే…దాన్ని స్వీకరించేందకు ఎవరూ ముందుకు రారు. ఇప్పుడు కోన వెంకట్ కూడా ఈ రెండు సినిమాల పరాజయం నుంచి అలాగే తప్పించుకుంటున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే కోన వెంకట్ వెర్షన్ వేరుగా వుంది. తను రాసిన సీన్ ఒక్కటి కూడా బ్రూస్ లీ లో వాడలేదని, సినిమా ఫైనల్ ప్రొడక్ట్ తనకు చూపించలేదని, ఎన్నోసార్లు చరణ్ కు, మేనేజర్ కు, చిరుకు అందరికీ ఈ విషయం చెప్పానని అంటున్నారు. ఈ విషయంలో సినిమా విడుదల తరవాత ఏదో ఒకటి చేయాలని కూడా తనో దశలో అనుకున్నా అంటున్నారు. మరి అఖిల్ విషయంలో ఏం జరిగిందో తెలియదు.

ఏమైనా, కోన వెంకట్ సంగతి పక్కన పెడితే మాటల రచయిత పాత్ర సినిమా విజయంలో కొంత వరకే వుంటుంది. మాటలు బాగున్నాయి.. ఫన్ పండింది అనే వరకు. కీలక విషయం సిన్మా స్కిప్ట్ లో వుంటుంది. అయితే బ్రూస్ లీ కి సంబంధించినంత వరకు స్క్రిప్ట్ కూడా కోన మిత్రుడు గోపీ మోహన్ దే.

ఏదైనా కోన అలా మాట్లాడడం కూడా సరికాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎలా జరిగిందో సినిమాలు పాడయ్యాయి. దాన్ని ఎవరూ పోస్టు మార్టమ్ చేయడం లేదు. అలాంటపుడు కోన మాత్రం ఎందకు చేయడం అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కోన కూడా దర్శకుడు.. నిర్మాత. మరి ఆయన సినిమాలకు ఏదన్నా తేడా జరిగితే సర్వం తనదే బాధ్యత అని అంగీకరిస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ రేపు శంకరాభరణం సినిమాను టార్గెట్ చేస్తాయేమో?