పబ్లిసిటీ విషయంలో తెలుగు సినిమా ప్రముఖులందరికీ ఓ కామన్ ఫోబియా వుంది. పెరటి చెట్టు మందుకు పనికి రాదు అన్నట్లుగా, తెలుగు మీడియా వారి కంటికి ఆనదు. నేషనల్ మీడియా, ఇంగ్లీషు మీడియా అనేసరికి కావాల్సినంత టైమ్ దొరుకుతుంది. సరే, ఏం చేస్తాం..ఎవరి ఆలోచనలు వారివి.
కానీ బాహుబలి లాంటి సినిమాలకు అంటే ఇంగ్లీషు మీడియా వెంటబడి, లోకల్ మీడియాను దూరం పెట్టినా వచ్చిన నష్టం లేదు. కానీ శ్రీమంతుడు లాంటి సినిమాకు కూడా అలాగే చేస్తే ఎలా? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు వరుసపెట్టి ఇంగ్లీష్ మీడియాకు ఇంటర్వూలు ఇస్తూ వస్తున్నారు. కానీ శ్రీమంతుడు ఆడాల్సింది మన బి సి సెంటర్లలో అని మరిచిపోతున్నారు.
బి సి సెంటర్లకు ఈ సోకాల్డ్ జాతీయ ఇంగ్లీషు మీడియా చేరమన్నా చేరదు. పక్కా మన తెలుగు మీడియానే వాటికి వారథి. అందువల్ల ఇప్పటికైనా మహేష్ బాబు తన పబ్లిసిటీ స్ట్రాటిజీ మార్చుకోవడం అవసరం. ఇంకా టైమ్ వుంది కదా..అనుకుంటే హైప్ అన్నది రాదు. ఎందుకంటే హైప్ అన్నది క్రమేపీ రావాలి కానీ ఒకటి రెండు రోజుల ముందు నుంచి హడావుడి చేస్తే వచ్చేది కాదు.