చౌదరి చుట్టాలబ్బాయ్ తో ప్రణీత

భాయ్ దెబ్బ నుంచి కోలుకోవడానికి దర్శకుడు వీరభద్రమ్ చౌదరికి ఏళ్లు పట్టింది. ఇప్పటికి యంగ్ హీరో ఆది సై అన్నాడు. థమన్ తో స్వరాలు రెడీ చేస్తున్నాడు. ఆది చేతిలో వున్న సినిమా పూర్తి…

భాయ్ దెబ్బ నుంచి కోలుకోవడానికి దర్శకుడు వీరభద్రమ్ చౌదరికి ఏళ్లు పట్టింది. ఇప్పటికి యంగ్ హీరో ఆది సై అన్నాడు. థమన్ తో స్వరాలు రెడీ చేస్తున్నాడు. ఆది చేతిలో వున్న సినిమా పూర్తి కాగానే వచ్చెనెల నుంచి సెట్ మీదకు వెళ్తుంది చుట్టాలబ్బాయ్ అని పేరు పెట్టుకున్న ఈ సినిమా. 

అయితే ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంతవరకు ఫిక్స్ కాలేదు. ప్రణీత అయితే బాగుంటుందని యూనిట్ భావిస్తోందట. ఫిజిక్ వరకు ఆది ఓకె కానీ, పవన్, విష్ణు, మనోజ్ ల సరసన వేసిన ప్రణీత, కాస్త లేతగా కనిపించే ఆది పక్కన ఎలా వుంటుందో? 

ఫిక్స్ అయితే మంచి చాన్సే. ఎందుకంటే సరైన సోలో చాన్స్ దక్కి చాలా కాలం అయింది ప్రణీతకు.