హీరోయిన్గా పరిచయం అయిన తర్వాత మొదటి సారిగా సమంత ఒత్తిడి ఎదుర్కొంటోంది. నాలుగేళ్ల పాటు తిరుగులేకుండా టాప్ పొజిషన్ని ఎంజాయ్ చేసిన సమంతకి వరుసగా చాలా ఫ్లాపులు తగిలాయి. ఈ ఏడాదిలో మనం తప్ప ఆమె నటించిన చిత్రాలన్నీ నిరాశ పరిచాయి. సికిందర్, రభస ఫ్లాప్స్ సమంత టాప్ సీట్‌కి ఎసరు పెట్టాయి.
అయితే ఈ స్లంప్ కంటే ముందే సమంత కాన్సన్ట్రేషన్ తమిళ చిత్ర సీమపై పెట్టింది. విజయ్‌తో నటిస్తోన్న కత్తి దీపావళికి రిలీజ్ కానుంది. మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంతో కోలీవుడ్‌లో ఫస్ట్ హిట్ కొట్టాలని సమంత తహతహలాడుతోంది. తెలుగులో మంచి రేంజ్లో ఉండి సమంత సడన్‌గా ఎందుకని తమిళ రంగంపై ఫోకస్ పెట్టినట్టు?
సమంత రైట్ టైమ్‌లోనే ఈ స్టెప్ తీసుకుందని, ప్రతి పెద్ద సినిమాలోను ఆమెని చూసి చూసీ ఆడియన్స్ బోర్ ఫీలవుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. పైగా అన్నీ మసాలా సినిమాలే కావడంతో అన్నిట్లో ఒకే తరహా పాత్రలతో సమంత బోర్ కొట్టించేస్తోంది. ఇలాంటి టైమ్‌లో కాస్త గ్యాప్ రావడం మంచిదేనని, అయితే ఇప్పటికీ ఆమె వర్రీ కావాల్సినంతగా ఆ ఫ్లాపులేం ఎఫెక్ట్ చేయలేదని అభిప్రాయపడుతున్నారు.