నైజాం హక్కులు అంటే తెలుగు సినిమాకు కాస్త పెద్ద షేర్ కింద లెక్క. హీరోలు, నిర్మాతలు, పంపిణీ దారులు అందరి ఆశలు నైజాం ఆదాయం పైనే. అలాంటిది ఇటీవల నైజాం హక్కులు అమ్ముడుపోవడం అంత సులవుగా కనిపించడం లేదు. నైజాం మొత్తం మీద దిల్ రాజు, సుధాకర్ రెడ్డి, ఇంకా ఒకరిద్దరు తప్ప పెద్ద పంపిణీ దారులు లేరు. ఇటీవల దిల్ రాజు పరిస్థితి అంత గొప్పగా లేదు. సినిమా దెబ్బలు బాగా తగులుతున్నాయి. పవర్ వసూళ్లు ఓకె అంటున్నారు కానీ అదీ అనుమానంగానే వుంది.
ఇలాంటి నేపథ్యంలో ఈ వారం, వచ్చేవారం వస్తున్నరెండు పెద్ద సినిమాల నైజాం హక్కులు నిర్మాతల దగ్గరే వుండిపోయాయని తెలుస్తోంది. ఆగడు, గోవిందుడు అందరి వాడేలే సినిమాలు రెండూ నైజాంలో నిర్మాతలే విడుదల చేసుకుంటున్నారు. మరి అమ్మలేదో, ఎవరూ కొనలేదో అన్నది పైకి ఎవరూ చెప్పరు కదా? మేమే చేసుకుంటున్నాం అంటారు. నైజాం అనేసరికి నిర్మాతలు భారీ మొత్తాలు చెప్పడం, కొన్న బయ్యర్లు కుదేలైపోడం మామూలు కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని టాలీవుడ్ టాక్.